Posted on 2024-09-10 18:23:36
ఇద్దరు నిందుతులు అరెస్ట్ రిమాండ్ కి తరలింపు.
25 గ్రాముల బంగారం స్వాధీనం.
వేములవాడ రూరల్ సర్కిల్ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి.
డైలీ భారత్, వేములవాడ: వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామం రాజానగర్ కి చెందిన శ్రీరాముల శ్రీనివాస్ తన ఇంటి పునరుద్ధరణలో భాగంగాతన ఇంటికి కలర్ వేయడానికి వేములవాడ కు చెందిన ఇద్దరు వ్యక్తులు నందెల్లి అనిల్ కుమార్, సయ్యద్ అఫ్రోజ్ లను కలసి కలర్ వేయడానికి ఒప్పదం చేసుకొని గత నెలరోజులు గా ఇంటికి కలర్ వేస్తుండగా తేదీ 8-09-2024 రోజు శ్రీనివాస్ తన భార్య కలిసి బెజ్జంకి వెళ్లి వచ్చేసరికి ఇంటిలో వున్న హ్యాండ్ బ్యాగ్ కనిపించలేదు. అనుమానంతో ఇల్లు అంత వెతకగా బ్యాగ్ కనిపించలేదు, బ్యాగ్ లో 25 గ్రాముల బంగారం ఎవరో గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్ళినట్టుగా గుర్తించి వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా కేసు నమోదు చేసివేములవాడ రూరల్ సి.ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో, ఎస్.ఐ మారుతి, సిబ్బంది తో టీమ్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయగా ఇంటికి కొద్దీ దూరంలో బ్యాగ్ కనిపింఛగా అట్టి బ్యాగ్ పై కలర్ మరకలు ఉండగా ఇల్లుకు కలర్ వేయడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను రాజనగర్ వద్ద అదుపులోకి తీసుకొని విచారించగా అట్టి దొంగతనం తామే చేసినట్టుగా ఒప్పుకోగా వారి వద్ద నుండి 25గ్రాముల బంగారం సీజ్ చేసి వారిని ఈ రోజు రిమాండ్ కి తరలించడం జరిగిందన ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి తెలిపారు.
24 గంటల్లో దొంగతనం కేసును చేధించిన వేములవాడ రూరల్ సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ మారుతి, సిబ్బంది తిరుపతి, శంకర్, యాకూబ్, రాజశేఖర్, వెంకటేష్ లను ఏఎస్పీ అభినందించారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >