| Daily భారత్
Logo




10 నెలల బాలుడిని పీక్కుతిని.. శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసిన వీధి కుక్కలు

News

Posted on 2024-09-11 13:13:26

Share: Share


10 నెలల బాలుడిని పీక్కుతిని.. శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసిన వీధి కుక్కలు

డైలీ భారత్, బోధన్: నిజామాబాద్ - బోధన్లో బస్టాండ్ సమీపంలో 2 రోజుల క్రితం ఓ తల్లి తన 10 నెలల బిడ్డను వదిలి మూత్రశాలకు వెళ్లింది.

తిరిగివచ్చి చూసేసరికి బాలుడు కనిపించలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులకు సమీప ప్రాంతంలో ఓ చిన్నారి శరీరభాగాలు దొరికాయి. 

కుక్కలు పీక్కుతిన్నట్టుగా గుర్తించి.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

బయటకు వెళ్లాలంటేనే భయమేస్తుంది. రోడ్ల మీద వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ మధ్య వీధికుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువైంది. మున్సిపాలిటీ సిబ్బంది అప్రమత్తమై వీధి కుక్కల బారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా వుంది. 

తాజాగా నిజామాబాద్ జిల్లాలో వీధికుక్కలు దాడి చేయడంతో 10 నెలల బాలుడు బలయ్యాడు. బాలుడి మృతదేహం లభ్యమైన తీరు.. చిన్నారిని కుక్కలు ఏ విధంగా పీక్కుతిన్నాయో అర్ధమవుతోంది. ఈ ఘోర ఘటన బోధన్ లో చోటు చేసుకుంది. భిక్షాటన చేస్తూ జీవనం సాగించే లక్ష్మి అనే మహిళ మంగళవారం (సెప్టెంబర్ 10) బోధన్ బస్టాండ్ కు సమీపంలో.. పెద్దగా జనసంచారం లేని ప్రాంతంలో రోడ్డుపై తన 10 నెలల బాబుని పడుకోబెట్టి బహిర్భూమికి వెళ్లింది. తిరిగి వచ్చి చూసేసరికి బాబు అక్కడ లేడు. చుట్టు పక్కల వెతికింది. ఎక్కడో దూరాన కుక్కలు కనిపించాయి. అవే తన బిడ్డను ఎత్తుకెళ్లి ఉంటాయని ఊహించింది. 

దాంతో లక్ష్మి బోధన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పిన ప్రాంతానికి వెళ్లిన పోలీసులు.. బాబు కోసం గాలించారు. పరిసర ప్రాంతాల్లో అన్వేషించగా..  బాలుడి శరీర భాగాలు కనిపించడంతో.. కుక్కలు పీక్కుతిన్నట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. దీంతో బాబును కుక్కలు ఎత్తుకెళ్లి దాడిచేసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. లభ్యమైన పేగులు, అవయవాలు చిన్నారివో కాదో తెలుసుకునేందుకు పోలీసులు వాటిని వైద్య పరీక్షలకు పంపారు. రిపోర్ట్ వచ్చాక..


ఈ ఘటనపై తదుపరి విచారణ చేస్తామని సీఐ వెంకట నారాయణ వెల్లడించారు.

Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >
Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >