| Daily భారత్
Logo




సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

News

Posted on 2024-09-14 18:39:41

Share: Share


సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

"డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్స్ కో ఆర్డినేషన్ సెంటర్" ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ గారు జిల్లా సైబర్ క్రైమ్స్ కో-ఆర్డినేషన్ సెంటర్ ను ప్రారంభించారు.చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పైన నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సైబర్ క్రైమ్స్ కో-ఆర్డినేషన్ సెంటర్ ద్వారా జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాల బారిన పడిన వారికి అండగా ఉంటూ,బాధితులు కోల్పోయిన నగదును తిరిగి వారు పొందే విధంగా సహాయం చేయడంలో తోడ్పడుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలిపారు.సైబర్ నేరాల బారిన పడిన వారికి సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్కరు చొప్పున 28 మంది సైబర్ వారియర్స్ ను కూడా కేటాయించడం జరిగిందని తెలియజేశారు.సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎత్తులతో అమాయక ప్రజల డబ్బును వారి అకౌంట్ల నుండి కాజేస్తున్నారని అన్నారు.జిల్లా వ్యాప్తంగా సైబర్ క్రైమ్స్ పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ అన్ని పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల పరిష్కారానికి ఈ సైబర్ క్రైమ్స్ కో ఆర్డినేషన్ సెంటర్ కృషి చేస్తుందని తెలిపారు.కావున జిల్లా ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండేందుకు జిల్లా పోలీస్ శాఖ తరపున అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిరంతరం అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేసారు. సైబర్ నేరాల బారిన పడి నగదు కోల్పోయిన వారు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేస్తే సైబర్ నేరగాళ్ల బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసి బాధితులు తిరిగి తమ నగదును పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.సైబర్ నేరానికి గురైనట్లు ఎంత త్వరగా గ్రహించి ఫిర్యాదు చేయగలిగితే (గోల్డెన్ అవర్లో) అంత త్వరగా కోల్పోయిన నగదును కాపాడుకోవచ్చని తెలిపారు.ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాల బారిన పడిన బాధితుల నుండి అందుకున్న ఫిర్యాదుల మేరకు 265 కేసులను నమోదు చేయడమైనది. రూ.2,61,62,175/-(రెండు కోట్ల అరవై ఒక్క లక్షల అరవై రెండువేల నూట డెబ్భై ఐదు) రూపాయలను సైబర్ నేరగాళ్ళ అకౌంట్ల నుండి తిరిగి బాధితులకు అందజేయడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తో పాటు పాల్గొన్న అధికారులు చుంచుపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ పరితోష్ పంకజ్ ఐపిఎస్,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు నాగరాజు,శ్రీనివాస్,చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ జితేందర్,1టౌన్ సీఐ కరుణాకర్, 2టౌన్ సీఐ రమేష్ మరియు కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలోని ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

బ్రైట్ LED లైట్లు.. స్టైల్ కాదు, ప్రాణాలకు ముప్పు!

Posted On 2026-06-19 12:35:32

Readmore >
Image 1

అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం

Posted On 2026-06-19 12:16:39

Readmore >
Image 1

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ

Posted On 2026-06-19 11:16:50

Readmore >
Image 1

దడ పుట్టిస్తున్న థార్‌ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...

Posted On 2026-06-19 11:14:35

Readmore >
Image 1

"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు

Posted On 2026-06-19 08:33:46

Readmore >
Image 1

అరవల్లి SI ఈట సైదులు సస్పెండ్

Posted On 2026-06-19 08:09:23

Readmore >
Image 1

శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-19 08:06:56

Readmore >
Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >