Posted on 2024-09-15 22:00:21
డైలీ భారత్, పశ్చిమబెంగాల్: కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటన మరువక ముందే నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మరో దారుణం వెలుగుచూసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన కుమారుడికి తోడుగా కోల్‌కతా ఇనిస్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ (ICH) చిల్డ్రన్స్ వార్డులో నిద్రిస్తున్న మహిళపై నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నిందితుడిని హాస్పిటల్‌లో వార్డ్ బాయ్‌గా పనిచేస్తున్న తనయ్ పాల్ (26)గా గుర్తించారు.
చిల్డ్రన్స్ వార్డ్‌లోకి ప్రవేశించిన తనయ్ పాల్ మహిళను అభ్యంతరకరంగా తాకాడు. ఈ ఘటనను నిందితుడు తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు.
ఆపై నిందితుడిని స్ధానిక కోర్టులో హాజరు పరచగా నిందితుడిని కోర్టు పోలీస్ కస్టడీకి ఆదేశించింది. ఇక పశ్చిమ బెంగాల్‌లోని బీర్భం జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్న నర్స్‌ను ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేయగా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ రోగికి నర్సు సెలైన్ ఎక్కిస్తుండగా రోగి ఆమెను అభ్యంతరకరంగా తాకాడు. తన పట్ల అసభ్యంగా వ్యవహరించడంతో పాటు తనపట్ల అనుచిత వ్యాఖ్యలు చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >