Posted on 2024-09-18 18:26:20
సహకరించిన అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపిన ఏ.ఎస్పీ శేషాద్రిని రెడ్డి
డైలీ భారత్, వేములవాడ: వేములవాడ సబ్ డివిజన్ పరిధిలో గత రెండు రోజులుగా నిర్వహించిన గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిసినట్లు ఏ.ఎస్పీ శేషాద్రిని రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గణేష్ నిమజ్జన వేడుకలు ఎంతో వైభవంగా, ప్రశాంతంగా జరిగాయని, సహరించిన మున్సిపల్, రెవెన్యూ, దేవాదాయ, అగ్నిమాపక, ఇతర అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా గణేష్ నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో జరిపి, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ వారికి సహకరించిన వేములవాడ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని గణేష్ మండపాల నిర్వాహకులకు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు, వేములవాడ సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపున అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నామని ప్రకటనలో పేర్కొన్నారు.
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >