| Daily భారత్
Logo




వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన నిందుతురాలికి ఏడాది జైలు శిక్ష.

News

Posted on 2024-09-18 18:56:22

Share: Share


వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన నిందుతురాలికి ఏడాది జైలు శిక్ష.

వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన నిందుతురాలికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ సిరిసిల్ల అసిస్టెంట్ సెషన్స్ న్యాయమూర్తి రాధిక జైష్వాల్ తీర్పు వెల్లడించినట్లు సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:ఇల్లంతకుంట మండలం జంగారెడ్డి పల్లెకు చెందిన వొల్లాల మల్లయ్య అనే వ్యక్తి వద్ద కరీంనగర్ కు చెందిన కిన్నెర మల్లవ్వ  అనే మహిళ 2017 సంవత్సరంలో రూ.4,30,000 అప్పుగా తీసుకొని తిరిగి మల్లయ్య కూతురు పెళ్లికి అప్పు తిరిగి ఇస్తానని స్టాంప్ పేపర్ పైన రాసి ఇవ్వగా, 2018 సంవత్సరంలో మల్లయ్య తన కూతురి పెళ్లి ఖాయం కావడంతో మల్లవ్వను డబ్బులు అడుగగా , మల్లవ్వ డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు బేధరింపులకు పాల్పడగా కూతురు పెళ్లి ఎక్కడ ఆగిపోతుందని తీవ్ర మనోవేదనకి గురైన మల్లయ్య తేదీ 19 ఆగస్టు 2018 రోజున పురుగుల మందు తాగి చనిపోయాడు. ఈ సంఘటనపై  ఇళ్లంతకుంట పోలీసులు కేసు నమోదు చేసి మల్లవ్వని రిమాండ్ కు తరలించి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో cms ఎస్ ఐ రవీంద్రనాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ నవీన్, సిఎంఎస్  హెడ్ కానిస్టేబుల్ శంకర్ లు కోర్టులో 10 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల లక్ష్మీప్రసాద్ వాదించాగా కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందుతురాలు మల్లవ్వకి ఏడాది జైలు శిక్ష విధించినట్లు డిఎస్పీ తెలిపారు.

బెదిరింపులకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న  కరీంనగర్ కు చెందిన కిన్నెర మల్లవ్వ అనే మహిళకు శిక్ష పడటంలో కిలంకంగా వ్యవహరించిన pp వేముల లక్ష్మీప్రసాద్,కోర్టు కానిస్టేబుల్ నవీన్, సిఎంఎస్  హెడ్ కానిస్టేబుల్ శంకర్ లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.

Image 1

ప్రేమ పేరుతో మోసం… యువతి ఆత్మహత్య

Posted On 2026-04-27 08:03:32

Readmore >
Image 1

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు

Posted On 2026-04-26 18:36:22

Readmore >
Image 1

పంజాబ్‌లో ప్రభుత్వమూ బీజేపీదేనా.?

Posted On 2026-04-26 18:30:28

Readmore >
Image 1

కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి

Posted On 2026-04-26 18:18:14

Readmore >
Image 1

కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు

Posted On 2026-04-26 18:16:27

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు

Posted On 2026-04-26 18:14:44

Readmore >
Image 1

ఎస్సై చైతన్య చందర్ పై వేటు

Posted On 2026-04-26 12:36:35

Readmore >
Image 1

“ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి – నివారణే ఉత్తమ వైద్యం”

Posted On 2026-04-26 11:49:35

Readmore >
Image 1

కలెక్టరేట్ లో ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు

Posted On 2026-04-26 11:43:59

Readmore >
Image 1

వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!

Posted On 2026-04-26 07:56:12

Readmore >