Posted on 2024-10-04 12:34:01
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సినీనటుడు అక్కినేని నాగార్జున మీద ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫైర్ అయ్యారు. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ మీద విమర్శలు చేయబోయి... మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబం మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు.
కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు గత రెండు రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో, ఇటు సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలో ప్రతీ ఒక్కరూ ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ.. కొండా సురేఖను తూర్పార పట్టారు. ఈ వ్యవహారంపై తీన్మార్ మల్లన్న అక్కినేని నాగార్జున మీద, సినీ ఇండస్ట్రీ మీద మండి పడ్డారు. కొండా సురేఖ మీద నాగార్జున పరువు నష్టం దావా వేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఒక బీసీ మహిళా మంత్రి కావడం వలనే... సురేఖ మీద కక్ష్య గట్టినట్లు ఉందని, చూస్తాం ఎంతవరకు వెళతారో అని అన్నారు. అక్కినేని కుటుంబం మీద కొండా సురేఖ ఏదో మిస్ ఫైర్ అయి మాటలు వదిలేసి, ఆ తర్వాత క్షమాపణలు అడిగారని.. అయినప్పటికీ తనని ఇంకా తిడుతున్నారని, మరి నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ ను అక్రమంగా కట్టారని తేలినపుడు ఎందుకు మీరు నోరు మెదపలేదు అంటూ సినీ ఇండస్ట్రీ మీద మల్లన్న ఫైర్ అయ్యారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >