| Daily భారత్
Logo




పేదల పెన్నిధి వెలిచాల జగపతిరావు..

News

Posted on 2024-10-19 19:26:28

Share: Share


పేదల పెన్నిధి వెలిచాల జగపతిరావు..

ఘనంగా జగపతిరావు రెండో వర్ధంతి

వెలిచాల రాజేందర్ రావు యువసేన ఆధ్వర్యంలో వేడుకలు

డైలీ భారత్, కరీంనగర్: పేదల పెన్నిధిగా సీనియర్ కాంగ్రెస్ నేత దివంగత వెలిచాల జగపతిరావు చిరస్థాయిలో నిలిచిపోయారని కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, వెలిచాల రాజేందర్ రావు యువసేన ప్రతినిధులు పేర్కొన్నారు. 

ప్రముఖ తెలంగాణ ఉద్యమ కారులు, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే దివంగత వెలిచాల జగపతిరావు రెండో వర్ధంతిని శనివారం కరీంనగర్ లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కార్పొరేటర్లు, రాజేందర్ రావు యువసేన ప్రతినిధులు జగపతిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు, కాంగ్రెస్ కార్పొరేటర్లు మాట్లాడుతూ జగపతిరావు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మార్క్ ఫెడ్ చైర్మన్ గా అత్యుత్తమ సేవలందించి మంచి పేరు సంపాదించారని పేర్కొన్నారు. నిరంతరం పేదల కోసం పరితపించిన మహా నేత జగపతిరావు అని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని తెలిపారు. రాష్ట్రంలోనే కరీంనగర్ నియోజకవర్గాన్ని అత్యుత్తమంగా అభివృద్ధిలో తీర్చిదిద్దారని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో కరెంటు వెలుగుల కోసం పరితపించిన మహనీయులు జగపతిరావు అని కొనియాడారు. పట్టుదలతో అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించి కరీంనగర్ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. యువత ఆశాజ్యోతి గా నిలిచి అనేకమందికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారని, వారి కుటుంబాలు ఎల్లవేళలా జగపతిరావును గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. వెలిచాల జగపతిరావు అంటేనే టైగర్ గా పేరు గడించారని, ఉదార స్వభావంతో అందరి మదిలో చిరస్మరణీయులుగా జగపతిరావు నిలిచారని వారు గుర్తు చేశారు. ఉమ్మడి జిల్లాల్లో ఎంతోమందిని రాజకీయాలకు పరిచయం చేసి ఉన్నత స్థానాలు అధిరోహించేలా కృషిచేసిన మహానేత జగపతిరావు అని వారు పేర్కొన్నారు. పేదల పెన్నిధిగా తుది శ్వాస విడిచే వరకు నిరంతరం వారి సంక్షేమ లక్ష్యంగా పనిచేశారని చెప్పారు. జగపతిరావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ, ఆయన అడుగుజాడల్లో ముందుకు నడవాలని సూచించారు. జిల్లా అభివృద్ధికి జగపతిరావు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. 

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ గౌడ్, ఆరెపల్లి మోహన్, కాంగ్రెస్ నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి, వహజుద్దీన్, తిరుపతి గౌడ్, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, కార్పొరేటర్లు సరిళ్ల ప్రసాద్, కాశెట్టి లావణ్య శ్రీనివాస్, గంట కళ్యాణి శ్రీనివాస్, ఆకుల పద్మ ప్రకాష్, ఆకుల నర్మదా నర్సయ్య, చాడగొండ బుచ్చిరెడ్డి, పిట్టల వినోద శ్రీనివాస్, నేతికుంట యాదయ్య, మెండి శ్రీలత చంద్రశేఖర్, కోటగిరి భూమా గౌడ్, హర్ష కిరన్మాయి మల్లేశం, కాంగ్రెస్ నాయకులు  నడిపెల్లి అశోక్ రావు, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, రోళ్ల సతీష్, వెలిచాల రాజేందర్ రావు యువ సేన ప్రతినిధులు గుర్రాల రాజేశ్వర్ రెడ్డి, కొండ పరశురామ్ గౌడ్, గుమ్మడి రమేష్, తడకపల్లి రవీందర్, గొట్టిముక్కల బ్రహ్మచారి, సంకినేని రానప్రతాప్, కందుల సాగర్, తదితరులు ఉన్నారు.

Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >
Image 1

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి

Posted On 2026-04-11 21:25:59

Readmore >
Image 1

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ నిరంతరం పోరాటం

Posted On 2026-04-11 21:20:31

Readmore >
Image 1

డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్

Posted On 2026-04-11 20:02:47

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:50:42

Readmore >
Image 1

జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:48:36

Readmore >
Image 1

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-04-11 19:47:25

Readmore >
Image 1

శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం

Posted On 2026-04-11 19:43:57

Readmore >
Image 1

సామాజిక న్యాయం చెప్పటం కాదు - అమలు చేయాలి

Posted On 2026-04-11 17:27:29

Readmore >
Image 1

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి

Posted On 2026-04-11 17:12:24

Readmore >