Posted on 2024-10-20 11:12:31
డైలీ భారత్, ఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో పేలుడు ఘటన కలకలం రేపుతోంది. ఢిల్లీలోని రోహిణి జిల్లా ప్రశాంత్ విహార్ లోని సీఆర్పీఎఫ్ పాఠశాల బయట పేలుడు సంభవించింది. ఆదివారం ఉదయం 7:45 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించినట్లు తెలస్తోంది. స్కూల్ యాజమాన్యం వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకున్నాయి. స్కూల్ గోడలు దెబ్బతిన్నాయని.. అయితే పేలుడు దేని వల్ల సంభవించింది అని పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్కూల్ ముందు నిలిపి ఉన్న ఓ కారుతో పాటు సమీపంలో ఉన్న ఓ షాపు ధ్వంసం అయ్యాయి.
ప్రశాంత్ విహార్ లోని సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడు సంభవించిందని ఉదయం 07:47 గంటలకు ఫోన్ కాల్ వచ్చిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే స్టేషన్ ఆఫీసర్, సిబ్బందికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడు ధాటికి పక్కనే పార్క్ చేసిన ఓ కారుతో పాటు, సమీపంలోనే ఉన్న దుకాణం అద్దాలు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు అవకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫోరెన్సిక్ టీమ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నాయి. ఫైరింజన్ సైతం అందుబాటులో ఉంచామని పోలీసులు తెలిపారు.
ప్రశాంత్ విహార్ లోని సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడుపై రోహిణి డీసీపీ అమిత్ గోయల్ స్పందించారు. పేలుడు సంభవించిన విషయం నిజమే. అయితే ఏ రకమైన పేలుడు, అందుకు కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నాయని డీసీపీ తెలిపారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >
గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-11 16:20:14
Readmore >