Posted on 2024-12-29 23:07:38
డైలీ భారత్, జూలూరుపాడు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రవి కథనం ప్రకారం, నిన్న అనగా తేదీ 28.12.2024న సాయంకాలం 06:00గంటల సమయంలో చండ్రుగొండ క్రాస్ రోడ్ వద్ద హెడ్ కానిస్టేబుల్ దయానందం మరియు బ్లూ కోట్ సిబ్బంది విజిబుల్ పోలీసింగ్ విధులు నిర్వహిస్తుండగా, అదే సమయంలో ఒక వ్యక్తి తన ఆటోను గుండెపుడి వైపు నుండి చండ్రుగొండ క్రాస్ రోడ్ వైపునకు అతివేగముగా, ఆజాగ్రతగా, నిర్లక్ష్యంగా ప్రజలకు హాని కలిగించే విధంగా నడుపుకుంటూ వస్తుండగా,అట్టి ఆటోను ఆపేందుకు దయానందం ప్రయత్నించగా, పోలీసు సిబ్బందిని చూసి ఆటో మరింత వేగంతో వెళ్తుండగా, వెంబడించి పట్టుకొని ఆటోను ఆపగా, సదరు వ్యక్తి పోలీసు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి, ఏకవచనంతో సంబోధించి, ఆటో ఆపే హక్కు మీకు ఎవరు ఇచ్చారురా అంటూ నెట్టివేసే ప్రయత్నం ప్రయత్నం చేయగా, సదరు ఆటో డ్రైవరు అయిన బాదావత్ కామేష్,తండ్రి పేరు: వెంకన్న, నివాసము బద్రు తండా, అను అతనిని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకురాగా, హెడ్ కానిస్టేబుల్ దయానందం ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేయనైనది.
చట్టాన్ని అతిక్రమించి పోలీసు వారిని ఇబ్బందులకు గురి చేసిన, పోలీసు వారి విధులకు ఆటంకం కలిగించిన, శాంతి భద్రతల సమస్యలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ సందర్భంగా ఎస్సై రవి మండల ప్రజలకు తెలియజేసినారు.
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >
కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >