| Daily భారత్
Logo




త్వరలో పెరగనున్న సిమెంటు ధరలు?

News

Posted on 2025-04-24 11:34:40

Share: Share


త్వరలో పెరగనున్న సిమెంటు ధరలు?

డైలీ భారత్, హైదరాబాద్: ఈ ఏడాది దేశీయ మార్కెట్‌లో సిమెంట్ ధరలు పెరగనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో సిమెంట్‌ ధరలు 2 నుంచి 4 శాతం (రూ.15-20) మేరకు పెరిగే అవకాశం ఉన్నట్టు ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ, విశ్లేషణ సంస్థ క్రిసిల్‌ తాజా రిపోర్టులో అంచనా వేసింది. 

కేంద్ర ప్రభుత్వం ప్రధాన మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ, గ్రామీణ హౌసింగ్ ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులు 10 శాతం పెంచిన నేపథ్యంలో సిమెంట్ రంగంలో డిమాండ్ 6.5-7.5 శాతం పెరుగుతుందని క్రిసిల్ పేర్కొంది. 

బడ్జెట్ కేటాయింపులతో పాటు ఈ ఏడాది రుతు పవనాలు సానుకూలంగా ఉండటం, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు స్పీడ్ అందుకుంటాయని, తద్వారా సిమెంట్ రంగం లో గిరాకీ ఊపందుకుం టుందని క్రిసిల్ తన ఇంటిలిజెన్స్ నివేదికలో వెల్లడించింది. 

గతేడాది నిరాశపరిచిన ఇండస్ట్రీ గత ఆర్థిక సంవత్సరం (2024-25) సిమెంట్‌ ఇండస్ట్రీకి అంతగా కలిసిరాలేదు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే సిమెంట్ పరిశ్రమలో వృద్ధిరేటు 4.5-5.5 శాతంగానే కొనసాగింది. 

దీనిని లోక్‌‌సభ ఎన్నికలు, భారీ వర్షాలు కారణమని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఒక దశలో ప్రముఖ కంపెనీల 50 కిలోల సిమెంట్‌ బస్తా రూ.300కి కూడా పడిపోయింది. ప్రసుతం కోలుకుని రూ.350 నుంచి రూ.360 మధ్య ట్రేడవుతోంది. 

ప్రధానంగా ప్రధానమైన 12 రాష్ట్రాలు ప్రకటించిన తమ బడ్జెట్‌ల కారణంగా దేశీయ సిమెంట్ డిమాండ్‌లో 63.65 శాతం భర్తీ చేయనున్నాయి. ఇది సిమెంట్ రంగానికి సానుకూలమని, గిరాకీ పుంజుకునేందుకు దోహదపడుతుందని క్రిసిల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ సెహుల్ భట్ చెప్పారు.

Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >
Image 1

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Posted On 2026-06-19 16:50:47

Readmore >
Image 1

జిల్లా కేంద్రంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

Posted On 2026-06-19 16:37:27

Readmore >
Image 1

హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డు

Posted On 2026-06-19 16:24:52

Readmore >