| Daily భారత్
Logo




ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఆపరేషన్‌1000 మంది మావోయిస్టులను చుట్టుముట్టిన 20వేల బలగాలు

News

Posted on 2025-04-24 17:20:15

Share: Share


ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఆపరేషన్‌1000 మంది మావోయిస్టులను చుట్టుముట్టిన 20వేల బలగాలు

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఆపరేషన్‌1000 మంది మావోయిస్టులను చుట్టుముట్టిన 20వేల బలగాలు

ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్‌ కొనసాగుతోంది.

డైలీ భారత్, చత్తీస్గడ్: ఛత్తీస్‌గఢ్‌లో అతిపెద్ద యాంటీ-నక్సల్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. బీజాపుర్‌ అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి. దాదాపు 1000 మంది మావోయిస్టులను సుమారు 20వేల మంది భద్రతా సిబ్బంది చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 

బీజాపుర్‌ జిల్లా ఊసూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వచ్చే కర్రెగుట్టల కేంద్రంగా అగ్రనేతలు, మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారనే సమాచారంతో కేంద్ర పారామిలటరీ బలగాల నేతృత్వంలో ఈ ఆపరేషన్‌ చేపట్టారు. కర్రెగుట్టలలో దాదాపు 1000 మంది మావోయిస్టులు దాగి ఉన్నట్లు సమాచారం. అగ్రనేత హిడ్మా నేతృత్వంలో వీరంతా అక్కడకు చేరినట్లు తెలుస్తోంది. వీరిలో కమాండర్‌ స్థాయి నేతలు, మావోయిస్టు అగ్ర నాయకులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. దీంతో ఈ ప్రాంతంలో కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. భీమవరంపాడు, పూజారీ కాంకేర్‌, పామేడు అటవీ ప్రాంతాల్లో కాల్పుల మోత మోగుతోంది. కూంబింగ్‌ నేపథ్యంలో కర్రెగుట్ట దండకారణ్యంలోని పలు గ్రామాలకు రాకపోకలను నిలిపివేశారు.

గాలింపు చర్యల్లో డీఆర్‌జీ బస్తర్ ఫైటర్ కోబ్రా, సీఆర్పీఎఫ్‌, ఎస్టీఎఫ్‌ సైనికులతో పాటు ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు పాల్గొన్నారు. 48 గంటలుగా ఈ కూంబింగ్‌ కొనసాగుతోంది. మందుపాతరలు అమర్చామని ఇప్పటికే మావోయిస్టులు లేఖల ద్వారా ప్రకటించారు. ప్రజలెవరూ అటవీ ప్రాంతంలోకి రావొద్దని హెచ్చరించారు. దీంతో గాలింపు అత్యంత అప్రమత్తంగా కొనసాగుతోంది. బుధవారం నాటికి 3 వేల మందితో కూంబింగ్‌ చేపట్టగా.. గురువారం ఉదయం అదనంగా మరో 2 వేల మందిని రప్పించారు. దీంతో ఈ 5 వేల మంది భద్రతా సిబ్బంది కర్రెగుట్టల అటవీప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు సమాచారం. అయితే, భద్రతా బలగాల సంఖ్య 20వేల వరకు ఉంటుందని పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. బస్తర్‌, అబూజ్‌బడ్‌ దండకారణ్యంపై హిడ్మాకు పూర్తి అవగాహన ఉంది. అతడి టార్గెట్‌గానే ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు సమాచారం. హిడ్మాతో పాటు మావోయిస్టు బెటాలియన్‌ చీఫ్‌ దేవాను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >
Image 1

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Posted On 2026-06-19 16:50:47

Readmore >
Image 1

జిల్లా కేంద్రంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

Posted On 2026-06-19 16:37:27

Readmore >
Image 1

హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డు

Posted On 2026-06-19 16:24:52

Readmore >
Image 1

బ్రైట్ LED లైట్లు.. స్టైల్ కాదు, ప్రాణాలకు ముప్పు!

Posted On 2026-06-19 12:35:32

Readmore >
Image 1

అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం

Posted On 2026-06-19 12:16:39

Readmore >