Posted on 2025-04-29 13:15:08
డైలీ భారత్, హైదరాబాద్:శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ వివరాలను మీడియాకు వివరించారు. ఈ నెల 20వ తేదీన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఓ చీటింగ్ కేసులో ఫిర్యాదు దారుడు, అతని కార్యకర్తను తప్పించేందుకు శామీర్ పేట్ ఎస్ఐ పరశురామ్ నాయక్ 2లక్షలు లంచం డిమాండ్ చేశాడని తెలిపారు. దీంతో ఫిర్యాదు దారుడు ఈ నెల 23వ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించారని చెప్పారు. అప్పటికే 21వ తేదీన 2 లక్షల రూపాయలు లంచం శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ పరశురామ్ కారులో ఇవగ, మరో సారి ఫోన్ చేసి అదనంగా మరో 25 వేలు కావాలని డిమాండ్ చేయగా ఫిర్యాదుడు 22 వేల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించాడని అన్నారు. సోమవారం మరో 22 వేల రూపాయలు పోలీస్ స్టేషన్ లోని చెత్త బుట్టలో వేసి వెళ్ళిపోవాలని ఎస్ఐ ఫిర్యాదు దారుడుకి సూచించారని చెప్పారు. ఎస్ఐ ఆదేశాల మేరకు ఫిర్యాదు దారుడు చెత్త బుట్టలో వేసి వెళ్లిపోగా ఏసీబీ సిటీ రేంజ్ యూనిట్ 2 అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ఎస్ఐ పరశురామ్ ను పట్టుకున్నామన్నాడు. దీంతో ఎస్ఐ పరశురామ్ పై కేసు నమోదు చేసి ప్రత్యేక న్యాయ మూర్తి ఎదుట హాజరు పరిచామన్నాడు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా లేదా వాట్స్ అప్ నంబర్ 9440446106 సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు సూచించారు.
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >