| Daily భారత్
Logo




వ్యక్తి ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించి చంపుతామని బెదిరించిన కేసులో ఐదుగురికి జైలు శిక్ష, జరిమానా

News

Posted on 2025-05-12 19:35:05

Share: Share


వ్యక్తి ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించి చంపుతామని బెదిరించిన కేసులో ఐదుగురికి జైలు శిక్ష, జరిమానా

ఒక వ్యక్తి యొక్క ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించి చంపుతామని బెదిరించిన కేసులో ఐదుగురికి 02 సం.జైలు  శిక్షతో, ఒక్కొక్కరికి 6000/- రూ. జరిమానా

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఒక వ్యక్తి యొక్క ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించి వారి యొక్క ప్రహరీ గోడ కూలగొట్టి తిట్టి చంపుతామని బెదిరించిన కేసులో ఐదుగురు వ్యక్తులకు రెండు సంవత్సరాల కఠిన కారగల శిక్షతోపాటు ఒక్కొక్కరికి 6000 రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమ స్థాయి న్యాయమూర్తి ప్రవీణ్ సోమవారం తీర్పు వెల్లడించినట్లు సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ తెలిపినారు.

ఈ మేరకు సి.ఐ మాట్లాడుతూ.. 

సిరిసిల్ల పట్టణం చంద్రంపేట గ్రామానికి చెందిన అరుణ ఇంటి  నెంబర్ 2-97 లో ఇల్లు కలదు.అరుణ ఇంటి చుట్టూ కాళీ ప్రదేశం ఉన్నందున  గ్రామ పంచాయతీ వారి అనుమతితో ప్రహరీ గోడను నిర్మించుకోగా ఎర్ర మల్లేశం అనే వ్యక్తి తన భూమిలో ప్రహరీ గోడను కట్టినారు అని ఎర్ర రాజవ్వ ,ఎర్ర సుజాత ,ఎడవల్లి మల్లవ్వ ,జింక దేవావ్వ,ఎర్ర మల్లేశం వారితో కుమ్మక్కై తేదీ.28.3.2018 రోజున పగలు ఒకటిన్నర గంటలకు అరుణ ఇంటికి వద్దలేనిది చూసి ఇంటి వెనక ప్రహరీ గోడను కూలగొట్టగా అది చూసిన చూసి కర్రె కర్రె పోచవ్వ వచ్చి అరుణకు చెప్పగా అరుణ పోచవ్వ వెళ్ళి ఎందుకు గోడ కూలగొట్టుతున్నారని అడగగా పై వారు అరుణ మరియు పోచవ్వ ను తిట్టుకుంటూ గడ్డపారతో పొడిచి గాయపరచుటకు ప్రయత్నించినారు ఇట్టి సంఘటన చూసి  నర్మేట లక్ష్మణ్, రగుడు లక్ష్మణ్ వచ్చి వారి నుండి కాపాడగా పై ఐదుగురు ఎప్పటికైనా చంపుతామని బెదిరించినారని సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి విచారణ అధికారి కేసు నమోదు చేసి విచారణ అనంతరం ఎండి లియాకతలి కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసినారు. సి.ఎం.ఎస్  శ్రావణ యాదవ్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ వేముల నరేష్ 11 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టినారు ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెలుమల్ల సందీప్ వాదించగా కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ఏ.ప్రవీణ్ గారు నేరస్తులు ఆయన రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి 6000 రూపాయల జరిమానా విధించడం జరిగిందని సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ తెలిపారు.

Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >
Image 1

అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి

Posted On 2026-06-22 20:48:51

Readmore >
Image 1

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-22 20:47:06

Readmore >
Image 1

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

Posted On 2026-06-22 20:28:54

Readmore >
Image 1

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-22 20:09:38

Readmore >