Posted on 2025-05-26 22:03:17
డైలీ భారత్, వరంగల్:ఎంజీఎం వైద్యులు, ఉద్యోగులపై కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అనుమతులు లేకుండా విధులకు హాజరుకాకపోవడం లాంటి చర్యలకు పాల్పడిన 77 మందికి సోమవారం మెమోలు జారీ చేశారు. శనివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఎంజీఎంను ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ సమయంలో వైద్యులు విధులకు హాజరుకాకపోవడం, శానిటేషన్ వ్యవస్థ అధ్వానంగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేకాదు.. చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఫోన్ లో కోరారు. వెంటనే కలెక్టర్ స్పందించి కలెక్టర్ విధులకు హాజరు కాని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగుల నుంచి వివరణ కోరుతూ మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్ ప్రాథమిక విచారణ జరిపి రిజిస్టర్లో సంతకాలు చేయని వైద్యులు, ఉద్యోగులతో పాటుగా విధులకు హాజరుకాని వైద్యులు, ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు. ఈ ఘటన ఎంజీఎం చరిత్రలో ఓ ఒక్క రికార్డును నెలకొల్పింది. ఒకే రోజు 77 మందికి మెమోలు జారీ చేయడం ఇప్పటి వరకు జరగలేదని, ఇంత మందిపై చర్యలు తీసుకోవడం ఇదే ప్రథమమని ఎంజీఎం ఉద్యోగులు గుసగుసలు పెట్టుకుంటున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >