| Daily భారత్
Logo




ప్రపంచ స్థాయిలో మంథని మేధస్సుకు చిహ్నంగా నిలవాలని కృషి : రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు

News

Posted on 2025-05-26 22:17:43

Share: Share


ప్రపంచ స్థాయిలో మంథని మేధస్సుకు చిహ్నంగా నిలవాలని కృషి : రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు

స్థానిక యువత నైపుణ్యం పెంపోందించి పరిశ్రమల స్థాపనకు కృషి

డ్రీమ్ స్టార్ట్ అండ్ రైస్ ఇన్నోవేషన్ నెట్వర్క్ లో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామీణ  ప్రోటో టైపింగ్ & ఇన్నోవేషన్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

డైలీ భారత్, మంథని: ప్రపంచ స్థాయిలో మంథని మేధస్సుకు చిహ్నంగా నిలవాలని కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐ.టి,  పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.

సోమవారం  మంథని పట్టణంలో బాస్ డిపో సమీపంలో డ్రీమ్ స్టార్ట్ అండ్ రైస్ ఇన్నోవేషన్ నెట్వర్క్ లో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామీణ  ప్రోటో టైపింగ్ & ఇన్నోవేషన్ సెంటర్ ను రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  తో కలిసి  ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... 

టీ వర్క్స్ వ్యవస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు సాంకేతికత పరంగా వారికి ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకుని వచ్చేందుకు మంథని పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రోటోటైపింగ్ & ఇన్నోవేషన్ సెంటర్ ఉపయోగపడుతుందని అన్నారు.

మంథని పట్టణంలో టీ వర్క్స్ బృందం నుంచి 3 శిక్షకులను నియమిస్తామని, భావితరాలకు విజ్ఞాన నిలయం గా మంథని ప్రాంతం నిలవాలని కృషి చేస్తున్నామని అన్నారు.  స్థానికంగా ఉన్న పిల్లలకు కింది స్థాయి నుంచి సంపూర్ణ పరిజ్ఞానం అందించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు.

మన జిల్లా పరిధిలో ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ప్రోటో టైపింగ్ & ఇన్నోవేషన్ సెంటర్ ను పరిశీలించేలా చూడాలని కలెక్టర్ కు మంత్రి సూచించారు.  పాఠశాల విద్యార్థులకే కాకుండా ఐటిఐ, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు కూడా వీటిని వినియోగించుకోవాలని అన్నారు. 

రైతులకు ఉన్న వివిధ సమస్యల పరిష్కారానికి వారికి వచ్చే వివిధ ఆలోచనలు కూడా కార్యరూపం దాల్చేందుకు సహాకారం అందిస్తామని అన్నారు.  ప్రపంచ స్థాయిలో మంథని మేధస్సుకు చిహ్నంగా నిలవాలని కృషి చేస్తున్నామని అన్నారు.

హైదరాబాద్ కు దాదాపు 250 కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రాంతమైన మంథనిలో చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీ తీసుకొని వచ్చామని, భవిష్యత్తులో ఇక్కడ విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని చూపించి అనేక కంపెనీలను తీసుకొని వస్తామని మంత్రి తెలిపారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ...

రోజు వారి జీవనంలో మనకు ఉన్న అనేక సమస్యలను సాంకేతికతను వినియోగించి చిన్న చిన్న మార్పులు చేస్తే పరిష్కారం అవుతాయని మనకు ఆలోచన వస్తుందని, అటువంటి ఆలోచనలను వాస్తవ రూపంలో దాల్చేందుకు సహకారం అందించే దిశగా టీ వర్క్స్, డ్రీమ్ స్టార్ట్ అండ్ రైస్ ఇన్నోవేషన్ నెట్ వర్క్ బృందం ఆధ్వర్యంలో ముందుకు సాగడం జరుగుతుందని అన్నారు.

పాఠశాలలో విద్యార్థులకు వచ్చే నూతన ఆలోచనలను ఇక్కడ ఉన్న ప్రోటో టైపింగ్ యంత్రాల , మెషిన్స్ ద్వారా తయారీకి ప్రయత్నిస్తామని అన్నారు.   రోజువారి సమస్యల పరిష్కారం ఆలోచనలు ముందుగా చిన్న స్థాయిలో తయారుచేసి సరిగ్గా పని చేసినట్లయితే పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు కూడా సహకారం అందుతుందని అన్నారు.

డ్రీమ్ స్టార్ట్ అండ్ రైస్ ఇన్నోవేషన్ నెట్ వర్క్ కు వయసుతో సంబంధం లేకుండా వినూత్న ఆలోచనలు ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. 

ఈ కార్యక్రమంలో టీ వర్క్స్ సంచాలకులు జోగేందర్, ఆర్.డి.ఓ. సురేష్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >