| Daily భారత్
Logo




మహిళా ఎస్ఐ పై కాంగ్రెస్ నేతలు దాడి

News

Posted on 2025-06-07 05:53:56

Share: Share


మహిళా ఎస్ఐ పై కాంగ్రెస్ నేతలు దాడి

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా కల్లూరులో దారుణం జరిగింది. విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఎస్ఐపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. దీంతో ఎస్ఐపై దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తల్లాడకు చెందిన కాంగ్రెస్ నేత రాయల రాము, అతని అనుచరులు కల్లూరులోని తిరువూర్ క్రాస్ వద్ద ఉన్న ఓ హోటల్ కు వచ్చారు. అయితే టిఫిన్ చేసే విషయంలో హోటల్ నిర్వాహకులతో రాము వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. ఈ వివాదం కాస్తా పెద్దదిగా మారింది.

దీంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న కల్లూరు ఎస్ఐ హరిత.. పరిస్థితిని అదుపు చేసేందుకు ఇరువర్గాలను ఆపాలని ప్రయత్నించారు. కానీ వారు ఆమె మాటలు లెక్కచేయలేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత రాము ఎస్ఐపై దాడికి దిగాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రాయల రాము సహా.. మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేశారు

Image 1

సెల్ఫీ మోజు... ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది!

Posted On 2026-04-10 05:06:54

Readmore >
Image 1

ఇకపై గంట ఆలస్యంగా రూ. 10,000 పైన డిజిటల్ చెల్లింపులు

Posted On 2026-04-10 05:05:52

Readmore >
Image 1

మార్పు కోసం నా అక్షరాలు-మంజుల పత్తిపాటి

Posted On 2026-04-10 02:51:39

Readmore >
Image 1

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో జీతాల కుంభకోణం

Posted On 2026-04-10 02:02:13

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

Posted On 2026-04-10 01:29:28

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్

Posted On 2026-04-09 15:19:40

Readmore >
Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >