Posted on 2025-06-08 12:14:39
బడి మనది... బడిని కాపాడుకునే బాధ్యత కూడా మనదే ...
ప్రముఖ సామాజిక కార్యకర్త, చైతన్య స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు డాక్టర్ వేముల మార్కండేయులు...
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: కుసుమరామయ్య బాలుర ఉన్నత పాఠశాల,సిరిసిల్ల ఉపాధ్యాయులు ఈరోజు ఇందిరానగర్ ,బివైనగర్లలో బడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక కార్యకర్త, చైతన్య స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు డాక్టర్ వేముల మార్కండేయులు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని, ఉన్నత విద్యావంతులు, అనుభవజ్ఞులు టీచర్లుగా పనిచేస్తున్నారని, ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి అనేక అవార్డులు అందుకున్నారని, గత రెండేళ్లుగా పాఠశాలలో చదువుకున్న పదవ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారని, బాసర త్రిబుల్ ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందారని అన్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ వంటి ఆధునిక సౌకర్యాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని సిరిసిల్ల పట్టణంలోని తల్లిదండ్రులు వారి పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాకాల శంకర్ గౌడ్ కుమ్మరి మల్లేశం సమ్మయ్య సామాజిక కార్యకర్తలు రామకృష్ణ నవీన్ తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >