| Daily భారత్
Logo




కీలకంగా మారనున్న ‘‘బ్లాక్ బాక్స్’’

News

Posted on 2025-06-12 18:40:57

Share: Share


కీలకంగా మారనున్న ‘‘బ్లాక్ బాక్స్’’

విమాన ప్రమాదానికి కారణాలు తెలిసే అవకాశం

డైలీ భారత్, అహ్మదాబాద్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చాలా మరణాలు సంభవించే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది. లండన్‌కి వెళ్తున్న ఎయిర్ ఇండియా 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలింది. వేగంగా నేలను ఢీకొట్టడంతో విమానంలో పేలుడు సంభవించి, మంటలు అంటుకున్నాయి. అయితే, ఇప్పుడు ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభమైంది.

ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణ ప్రారంభించింది. విమానంలో కీలకమైన ‘‘బ్లాక్ బాక్స్’’ దొరికితే కారణాలు తెలిసే అవకాశం ఉంది.

బ్లాక్ బాక్స్ అనేది విమాన పనితీరు, పైలట్ల మధ్య సంభాషణలను రికార్డ్ చేసే ఒక పరికరం. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్ పిట్ వాయిస్ రికార్డర్ రెండు భాగాలను బ్లాక్ బాక్స్‌గా పరిగణిస్తారు. ఫ్లైట్ డేటా రికార్డర్ విమానం ఎంత ఎత్తులో ఉంది..? ఎంత వేగంతో ప్రయాణిస్తుంది..?, ఫ్లైట్ కంట్రోల్స్ పనితీరును రికార్డ్ చేస్తుంది. ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR) ఎత్తు, వేగం, ఇంజిన్ థ్రస్ట్, ఫ్లైట్ పాత్ డేటాతో సహా కీలకమైన టెక్నికల్ పెరామీటర్స్‌ని నమోదు చేస్తుంది. ఇక కాక్ పిట్ వాయిస్ రికార్డర్ పైలట్ల మధ్య సంభాషణలు, ఏటీసీ నుంచి వచ్చే ఆదేశాలు వంటి వాటిని సేకరిస్తుంది.

బ్లాక్ బాక్స్ దొరికితే విమాన ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడం సులువు అవుతుంది. సహజంగా బ్లాక్ బాక్సులు అత్యంత దృఢంగా ఉంటాయి. ఎలాంటి ప్రమాదానైనా తట్టుకుంటాయి. ప్రకాశవంతమైన నారింజ కలర్‌లో ఉండే ఈ బాక్స్ పేలుళ్లు, మంటలు, నీటి పీడనాన్ని, హై స్పీడ్ క్రాష్ లను తట్టుకుంటుంది. 25 గంటల సమాచారాన్ని నిల్వ చేస్తుంది

Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >