| Daily భారత్
Logo




గంజాయి కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు

News

Posted on 2025-06-19 12:23:54

Share: Share


గంజాయి కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు

డైలీ భారత్, జనగామ జిల్లా: బుధవారం ఉదయం దేవరుప్పుల పోలీస్ స్టేషన్ పరిధిలో గల ధరావత్ తండా నుండి ధర్మగడ్డ తండాకు ఉదయం 9:30 సమయంలో ఎస్సై సృజన్ కుమార్ తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ధర్మగడ్డ తండా వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించగా వారిని చూసి ఎందుకు భయపడుతున్నావని ప్రశ్నించి,వారి చేతిలో ఉన్న కవర్ లో ఏముంది అని అడుగగా వారు తడబడుతూ, భయపడుతూ వారి వద్ద గంజాయి ఉన్నదని తెలుపగా వెంటనే ఎస్పై వారిని అదుపులోకి తీసుకొని వారి యొక్క వివరాలు అడుగగా భూక్యా నరేశ్,చౌడబోయిన సురేష్ వీరు ధర్మగడ్డ తండాకు చెందిన వారని చెప్పగా వారిని విచారించగా భూక్యా నరేశ్ హైదరాబాద్ లో పని చేసేటప్పుడు అతని స్నేహితుల ద్వారా సిగిరెట్ తాగడం అలవాటు అయిందనీ వారితో పాటు దుల్ పేటకు వెళ్ళి గంజాయ్ తాగడం కూడా అలవాటు అయిందనీ స్వంత ఊరికి వచ్చిన్నపుడు స్నేహితుడు అయిన చౌడబోయిన సురేష్ కు కూడా గంజాయ్ ఇవ్వడంతో ఇద్దరు కలిసి గంజాయి తాగుతుండే వాళ్ళమని చెప్పారని,వారి వద్ద నుండి రెండు చిన్న పాకెట్ల గంజాయిని రూ.2 వేల విలువ గల వాటిని స్వాదినం చేసుకొని వారి వద్ద వున్న రెండు ప్లాస్టిక్ కవర్ తెరచి చూడగా అందులో రెండు ప్లాస్టిక్ జిప్ కవర్లు ఉన్నాయని,వాటిని తెరచి చూడగా ఎండిన మొగ్గల మిశ్రమంగా కలిగి ఘాటైన వాసన వస్తుండగా ఈ పదార్థం ఏమిటని అడుగగా వారు ఎండు గంజాయని తెలిపారు.గంజాయిని తూకము వేయగా, అది 20 గ్రాములు ఉందని, సురేష్ వద్ద గల వీవో కంపెనీకి చెందిన నలుపు రంగు మొబైల్ ఫోన్ దాని నెంబర్ 7569132692 ఐఎంఈఐ నెంబర్ 867663044190293 867663044190285 తీసుకొని రావడం జరిగినదనీ వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగినదని, నెరస్తులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన దేవరుప్పుల ఎస్సై సృజన్ కుమార్ ను వారి సిబ్బందిని డీసీపీ రాజమహేంద్ర నాయక్,ఏసీబీ అంబటి నరసయ్య సీఐ జానకిరామ్ రెడ్డి అను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కొడకండ్ల ఎస్సై రాజు స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >