| Daily భారత్
Logo




దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి ఆత్మహత్య

News

Posted on 2025-06-19 13:01:30

Share: Share


దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి ఆత్మహత్య

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌ మాదాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సూసైడ్ చేసుకుంది. కాగా మృతురాలిని సుష్మ(27)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సికింద్రాబాద్‌ అడ్డగుట్టలో నివాసముంటున్న సుష్మ అనే యువతి ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. బుధవారం రోజున హైటెక్ సిటీలోని తన కార్యాలయానికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, సాయంత్రం అయినా ఆమె ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు.

దీంతో తండ్రి జంగయ్య తన కూతురు కనిపించడంలేదంటూ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుష్మ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే దుర్గం చెరువులో ఓ యువతి మృతదేహం ఉన్నట్లు వారికి సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడకి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా..ఆ మృతదేహం సుష్మదిగా నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో సుష్మ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. సుష్మ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >