| Daily భారత్
Logo




పని ఒత్తిడి తట్టుకోలేక యువకుని ఆత్మహత్య

News

Posted on 2025-06-19 14:09:52

Share: Share


పని ఒత్తిడి తట్టుకోలేక యువకుని ఆత్మహత్య

పని ఒత్తిడి తట్టుకోలేక ఓ చార్టెడ్ అకౌంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన గచ్చి బౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

డైలీ భారత్, హైదరాబాద్‌: పని ఒత్తిడి తట్టుకోలేక ఓ చార్టెడ్ అకౌంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన గచ్చి బౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సురేష్ రెడ్డి (28) అనే యువకుడు మణికొండలోని ఓ కంపెనీలో చార్టెడ్ అకౌంట్ గా పనిచేస్తున్నాడు. అయితే సురేష్ గత రెండు రోజుల క్రితం అక్క ఇంటికి వెళ్తున్నానని చెప్పి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజరాజేశ్వరి కాలనీకి వచ్చాడు. 2 రోజుల కోసం ఒక సర్వీస్ అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నాడు. అపార్ట్‌మెంట్‌కు వచ్చిన సమయంలో సురేష్‌ తనతో పాటు హీలియం సిలిండర్ కూడా తెచ్చుకున్నాడు.

మొదటి రోజు కాకుండా మరుసటి రోజు తన డైరీలో సూసైడ్ నోట్ రాసుకున్నాడు. ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సూసైడ్ నోట్ లో రాసుకున్నాడు. అనంతరం తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని, హీలియం గ్యాస్‌ పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు. రూమ్ లోకి వెళ్లి రెండు రోజులైనా కూడా సురేష్ బయటకి రాకపోవడంతో అనుమానం వచ్చి అపార్ట్మెంట్ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా సురేష్ బెడ్ మీద విగతజీవిగా పడి ఉన్నాడు. పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


#crime #crime news

Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >