Posted on 2025-06-24 17:36:17
అదృశ్యమైన బాలుని కుటుంబ సభ్యులకి అప్పగించిన పోలీసులు
చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై తోపాటు కానిస్టేబుల్ లను అభినందించిన సీఐ
డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం చెందిన మొహమ్మద్ తాజుద్దీన్ (8) అనే బాలుడు సోమవారం మధ్యాహ్నం అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ రమాకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా కానిస్టేబుల్ అయినటువంటి బాబయ్య, రషీద్, సాయి విహార్, దినేష్ లను ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు తో పాటు, చుట్టుపక్క ప్రాంతాల ప్రజల ద్వారా సమాచారం సేకరించి సిద్దిపేటలోని వారి నానమ్మ వద్ద ఉన్నట్లు సమాచారం తెలుసుకొని మంగళవారం మధ్యాహ్నం బాలుడుతోపాటు నానమ్మల ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అట్టి బాలుడిని సిడబ్ల్యుసి అధికారులకు అప్పగించినట్లు సిఐ వెల్లడించారు.
చాకచక్యంగా వ్యవహరించి 24 గంటలలోపే బాలుడి ఆచూకీ గుర్తించి కేసును చేదించినందుకు ఎస్ఐ రమాకాంత్ ను,నాలుగురు కానిస్టేబుల్ లను సిఐ అభినందించారు.
సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...
Posted On 2026-08-11 07:54:33
Readmore >
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >