Posted on 2025-06-25 10:01:32
డైలీ భారత్, న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రిఠాలా మెట్రో స్టేషన్ సమీపంలోని ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది 16 ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే పరిసర ప్రాంతాలను దట్టమైన పొగ ఆవరించింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ఇక ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి సైతం ఆందోళనగా ఉందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో సజీవ దహనమైన మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. అవి ఏ మాత్రం గుర్తు పట్టలేని విధంగా మారాయి. ఈ నేపథ్యంలో వాటిని సైతం పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బాధిత కుటుంబాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >