Posted on 2023-12-15 13:47:33
డైలీ భారత్, హైదరాబాద్:నియంతృత్వ పాలన పోక డల నుంచి తెలంగాణ రాష్ట్రం విముక్తి పొందిందని గవర్నర్ తమిళ్ సై అన్నారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాం క్షలతో ఏర్పడిన రాష్ట్రం ఇది అని, అమరవీరుల ఆకాం క్షలను పరిగణనలోకి తీసు కొని పాలన సాగిస్తామని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు.
తెలంగాణ కోసం ప్రాణం త్యాగం చేసిన వారికి సభావేధికంగా నివాళు లర్పిస్తున్నామన్నారు. కొత్త ప్రభుత్వానికి గవర్నర్ అభినందనలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిం చారు. మంత్రులు, ఎంఎల్ ఎలకు అభినందనలు తెలి పారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతు న్నానని, ప్రజా సేవలో విజయం సాధించాలని కొత్త ప్రభుత్వాన్ని కోరుతు న్నామన్నారు. అణచివేత, అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహిం చరని చెప్పారు.
కొత్త ప్రభుత్వం ప్రజాప్రభు త్వం అని గవర్నర్ తమిళిసై ప్రశంసించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీక రించేందుకు ప్రజావాణి చేపట్టామని, ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తామన్నారు.
తమ జీవితాల్లో మార్పు కావాలని ప్రజలు కోరుకు న్నారని గవర్నర్ పేర్కొ న్నారు. త్వరలో మెగా డి ఎస్ సి ప్రకటిస్తామన్నారు. తెలంగాణ పాలన దేశానికి ఆదర్శం కాబోతుందని కొనియాడారు.
ప్రజాసంక్షేమం కోసమే ఆరు గ్యారంటీలు ప్రకటించామని, హామీలకు చట్టబద్ధత కల్పించే దస్త్రంపై సిఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారని పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >