| Daily భారత్
Logo




మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రమాదం, నేరం : కె నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా

News

Posted on 2025-07-06 12:57:38

Share: Share


మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రమాదం, నేరం :  కె నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా

- మధ్యంమత్తులో వాహనాలు నడుపుతున్న వారిపై నెలరోజులగా స్పెషల్ డ్రైవ్.

- గడిచిన నెలరోజుల్లో 1509 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు, రూ.5 లక్షల 41 వేల జరిమానా.

- 15 మంది మద్యంబాబులకు జైలు శిక్ష అమలు.

డైలీ భారత్, సూర్యాపేట: గత నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ జిల్లా కేంద్రం సహా అన్ని పోలీసు స్టేషన్ ల పరిధిలో మద్యంతాగి వాహనాలు నడుపుతున్న వాహనదారులపై స్పెషల్ డ్రైవ్ ద్వారా 1509 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగినది జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ ఒక ప్రకటనలో తెలిపినారు. ఇందులో 15 మందికి జైలు శిక్షల పడగా మొత్తం కేసుల్లో రూ.5 లక్షల 41 వేలు కోర్టుల నందు జరిమానా కట్టించడం జరిగినది. మద్యంతాగి వాహనాలు నడుపుతున్న వారిపై సూర్యాపేట డివిజన్ పరిధిలో 957 కేసులు, కోదాడ డివిజన్ పరిధిలో 552 కేసులు నమోదు చేయబడ్డాయి. మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రమాదం, నేరం అందుకు జైలు శిక్షలు, జరిమానాలు తప్పవు అని ఎస్పి గారు హెచ్చరించారు. వానదారులు మద్యం తాగి వాహనం నడపడం ద్వారా పత్యక్షంగా కాని, పరోక్షంగా కాని రోడ్డు ప్రమాదాలకు కారకులవుతున్నరు, మధ్యంతాగి వాహనం నడిపినవారు సైతం  మృత్యువాత పడుతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అన్నారు. ఇది దృష్టిలో ఉంచి జిల్లా వ్యాప్తంగా మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగినది. అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనీఖీలు పటిష్టంగా నిర్వహిస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీల్లో పట్టుబడిన వాహనదారులకు ముందుగా కౌన్సిలింగ్‌ నిర్వహించిన అనంతరం కోర్టులో న్యాయమూర్తి ఎదుట పర్చడం ద్వారా వాహనదారులకు కోర్టులో జైలు శిక్షలు, జరిమానా విధించడం జరుగుతుందని. ఎస్పీ సూచనలు చేస్తూ కుటుంబాలను దృష్టిలో వుంచుకొని వాహనదారులు మద్యం సేవించి వాహనం నడపవద్దని, తప్పిదాలతో ఇతరులు కూడా ప్రాణాలు కోల్పోయినవారు, అంగవైకల్యంగా జీవితాలను కొనసాగిస్తూన్నారని, ఇకనైన వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, వాహనదారులు తమ గమ్యానికి సురక్షితంగా చేరుకోవడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పి తెలిపినారు తెలిపారు.

Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >