| Daily భారత్
Logo




అఘాయిత్యానికి పాల్పడి పోలీసులకు చిక్కిన ఆటో డ్రైవర్

News

Posted on 2025-07-06 13:29:58

Share: Share


అఘాయిత్యానికి పాల్పడి పోలీసులకు చిక్కిన ఆటో డ్రైవర్

డైలీ భారత్, కర్నూల్: తల్లితో కలిసి మరో ఊరుకు వచ్చిన విద్యార్థిని తప్పిపోయింది. ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించి ఓ ఆటో డ్రైవర్‌కు చిక్కింది. ఆ బాలికకు మాయమాటలు చెప్పిన డ్రైవర్‌ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత లాడ్జ్‌లో దిగబెట్టే ప్రయత్నం లో పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కి్స్తున్నాడు. ఈ ఘటనలో పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం

కర్నూలు జిల్లా ఆదోని డివిజన్‌లో ఇంటర్మీడియట్‌ చదువుతున్న బాలిక తన తల్లితో కలిసి ఈ నెల 4న ఎమ్మిగనూరుకు వచ్చింది. అయితే పని ముగించుకుని సాయంత్రం ఇంటికివెళ్లే క్రమంలో బాలిక తప్పిపోయింది. తన తల్లి జాడ వెతుకుతూ ఆదోని పట్టణం బసవేశ్వర సర్కిల్‌కు చేరుకుంది. అక్కడి నుంచి బస్టాండ్‌కు వెళ్లి, తన సొంత ఊరికి వెళ్లాలనుకున్న ఆ బాలిక ఆదోని మండలం ఇస్వీ గ్రామానికి చెందిన రమేశ్‌ అనే డ్రైవర్‌ ఆటోను ఎక్కింది. ఆమెను తీసుకుని బస్టాండ్‌కు వెళ్లే సమయానికి రాత్రి కావడంతో వారి ఊరికి వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్లేందుకు బస్సులు ఉండవని, ఈ రాత్రికి సమీపంలో ఉన్న తన అక్క వాళ్ల ఇంట్లో ఉండవచ్చని నమ్మించాడు. అది నిజమేనని నమ్మిన ఆ బాలిక అతనితో పాటు వెళ్లింది.

కానీ, రమేష్‌ ఆమెను అదే ఆటోలో పట్టణ శివారులోని ఓ నిర్మానుష  వెంచర్‌లోకి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. భయంతో బాధితురాలు రోదించింది, దీంతో తోటి  స్నేహితులతో కలిసి ఆమెను ఆదోనిలోని ఓ ప్రైవేటు లాడ్జ్‌లో వదిలేందుకు తీసుకు పోయాడు.  అయితే పోలీసుల అనుమతి ఉంటేనే  లాడ్జ్‌ లో చేర్చుకుంటామని నిర్వాహకులు చెప్పడంతో.. అనుమతి కోసమని నిందితుడు ఆ అమ్మాయిని తీసుకుని మూడో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ పోలీసులు ఎంక్వయిరీ చేసే క్రమంలో అతని తీరును అనుమానించారు.  బాలికను ఆరా తీయగా తనపై జరిగిన అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి  తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రమేశ్‌పై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా బాలిక తల్లిదండ్రులను పిలిపించి ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు.

Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >