| Daily భారత్
Logo




5 నెలల కన్న కూతురిని కడ తేర్చిన కసాయి తల్లి

News

Posted on 2025-07-08 22:50:20

Share: Share


5 నెలల కన్న కూతురిని కడ తేర్చిన కసాయి తల్లి

కేసు నమోదు చేసి నిందితురాలిని జైలుకు పంపిన పోలీసులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నవమాసాలు మోసి జన్మనిచ్చిన కన్న తల్లే అభంశుభం తెలియని ఐదునెల్ల తన కూతుర్ని కాడతేర్చిన ఘటన మండలంలోని గోనుగొప్పుల గ్రామంలో విశాధాన్ని నింపింది. తన భర్త తన కూతుర్ని పట్టించుకోవడం లేదని, మందలించిడన్న కోపంతో తాగిన మైకంలో కన్నకూతురు అని చూడకుండా ఐదునెల్ల పసికందును ఆ కసాయి తల్లి చిదిమివేసింది. భీమ్ గల్ సీ.ఐ సత్యనారయణ గౌడ్ తెలిపిన వివరాల మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గోనుగొప్పుల గ్రామానికి చెందిన గంగోని మల్లేష్ తన భార్య సిరసు రమ్య తాగుడికి అలవాటై తన ఐదునెలల కూతురు శివానిని పట్టించుకోవడం లేదని ఈ నెల 7 న మందలించి రోజువారి పనుల్లో భాగంగా బయటకు వెళ్ళాడు. తన కూతురు శివాని కారణంగా తన భర్త మందలించడని క్షణికావేశంలో చిన్నారి శివానిపై దుప్పటి కప్పి అధిమిపట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపివేసింది. నిందితురాలి భర్త నా కూతుర్ని నా భార్యే చంపేసిందని అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం నిందితురాలు పారిపోతుండగా భీమ్ గల్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పట్టుకున్నారు. దీంతో నిందితురాలిని విచారించగా తానే చంపినట్లు నేరం  అంగీకరించింది.

దీంతో పోలీసులు నిందితురాలు రమ్యను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసారు. అనంతరం ఆమెను మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చగా నిందుతురాలిని జైల్ కు పంపినట్లు సీ. ఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >