| Daily భారత్
Logo




గంజాయి విక్రయిస్తున్న వారిని పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు

News

Posted on 2025-07-09 21:28:56

Share: Share


గంజాయి విక్రయిస్తున్న వారిని పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ లోని రెండు ప్రాంతాలలో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సిఐ స్వప్న ఆధ్వర్యంలో బుధవారం మోపాల్ మండలం ఎల్లమ్మ కుంట, నగరంలోని అర్సపల్లి ప్రాంతాలలో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఎల్లమ్మ కుంట ప్రాంతంలో షేక్ నాజీయా బేగం, కే.మాదవ్ వద్ద 1.135 కిలో గ్రాములు ఎండు గంజాయి, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. అర్సపల్లికి చెందిన షేక్ పర్వాజ్ అనే వ్యక్తి వద్ద 300 గ్రాముల ఎండు గంజాయి, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.5 యువతకు మత్తు పదార్థాలకు అలవాటు చేసే విధంగా గంజాయి ఇతర మత్తు పదార్థాలను విక్రయించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఎన్ ఫోర్స్ మెంట్ సిఐ స్వప్న తెలిపారు. తొలిసారి గంజాయి కేసులో మహిళను అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఈ దాడులలో ఎస్ఐలు నర్సింహ చారీ, రాం కుమార్ లు, హెడ్ కానిస్టేబుళ్లు రాజన్న, సిహెచ్ నారాయణ రెడ్డి, కానిస్టేబుళ్లు బోజన్న, హమీద్, శివసాయి, విష్ణు, అవినాష్, మంజుల లు ఉన్నారు.

Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >