Posted on 2025-07-09 18:12:16
బైక్ పై వస్తుండగా కుక్క రావడంతో తప్పించబోతుండగా దారుణం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: దైవదర్శనం కోసం బాసర అమ్మవారిని దర్శించుకొని తిరిగి వస్తుండగా నగరంలోని కంటేశ్వర హౌసింగ్ బోర్డ్ వద్ద కుక్కను తప్పించబోయి బైక్ ప్రమాదానికి గురైంది. ఈఘటన నిజామాబాద్ ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఏఎస్సై భార్య మృతి చెందింది. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సగర శివారులోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డు పరిధిలో వీరి ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డు వచ్చింది. దీంతో దాన్ని తప్పించబోయే క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో బైక్ పై వెనకాల కూర్చున్న భవాని కింద పడడంతో తలకు బలమైన గాయమైంది. గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు మరణించినట్లుగా నిర్ధారించారు. అయితే వారం రోజుల్లో కుమారుడు విదేశాలకు వెళుతున్నాడని సంతోషంలో దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తన సతీమణి మృతి చెందిన విషయం తెలియడంతో ఇంటలిజెన్స్ ఏఎస్ఐ భీమారావు కన్నీరు మునీరుగా విలపించారు. అయితే వీరు స్థానికంగా గంగా స్థాన్ 1 లోని విష్ణు ప్రియ రెసిడెన్సి లో నివాసం ఉంటున్నారు. మరికొద్ది క్షణాల్లో ఇంట్లోకి అడుగుపెట్టే క్రమంలో కుక్క రూపంలో భవాని అనంతలోకాలకు వెళ్ళిపోయింది. భవాని అపార్ట్మెంట్లో ఎవరికి ఎలాంటి ఆపద ఎదురైనా ముందుండి వారికి ధైర్యం చెబుతూ అండగా నిలిచేవారని ఇప్పుడు ఆమె ఆకస్మిక మరణం తమను తీవ్రంగా కలిసి వేస్తుందని అపార్ట్మెంట్ వాసులు పేర్కొంటున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ఏఎస్ఐ ఐ సతీమణి మృతి చెందిన విషయం తెలియడంతో ఏఎస్ఐ తోటి సిబ్బంది తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది అధికారులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చరి పద్దకు చేరుకున్నారు. కాగా ప్రమాద ఘటన పై పోలీసులు కేసు దర్యాప్తు చేపడుతున్నారు.
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >