| Daily భారత్
Logo




వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో మౌలిక వసతుల కల్పనకు సూక్ష్మ ప్రణాళిక నివేదికను అందజేయాలి

News

Posted on 2025-07-09 18:07:31

Share: Share


వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో మౌలిక వసతుల కల్పనకు సూక్ష్మ ప్రణాళిక నివేదికను అందజేయాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద

నిర్మాణ పనులు, ఆయా విభాగాల కేటాయింపు పై అధికారులకు జిల్లా కలెక్టర్ దిశా నిర్దేశం

డైలీ భారత్, వరంగల్: వరంగల్ సూపర్ స్పెషాలిటీ నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి ఆయా క్లినికల్ విభాగాల్లో వసతుల కేటాయింపునకు సంబంధించిన వివరాలతో కూడిన సూక్ష్మ ప్రణాళిక నివేదికను 15 రోజుల్లో సమర్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద వైద్య అధికారులను ఆదేశించారు. 

బుధవారం వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లోని సమావేశపు హాలులో వైద్యాధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమావేశమై నిర్మాణ పనులను, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ రేడియాలజీ పాథాలజీ ఫోరెన్సిక్,  ఆనిష్టేషియా బయో కెమిస్ట్రీ ఫారెన్సీక్ మెడిసిన్,  తదితర  క్లినికల్ విభాగాలకు  భవనాలలో కేటాయించిన అంతస్తుల వారిగా గదులు, ఇంకను ఇతర విభాగాల ఏర్పాటు కొరకు కావలసిన గదులు, సంబంధిత క్లినికల్ విభాగాల కు అవసరమగు మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై చర్చించారు.

అనంతరం సూపర్ స్పెషాలిటీ భవనంలో ప్రాథమికంగా కేటాయించిన ఆసుపత్రిలోని వివిధ  అంతస్తులలో వివిధ విభాగాల వైద్యాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలెక్టర్ క్షేత్ర స్థాయిలో అంతస్తుల వారిగా ఆయా క్లినికల్ విభాగాలకు కేటాయించిన గదులను పరిశీలించి సమర్ధ వంతంగా నిర్వహించుటకు కావలసిన సదుపాయాల గురించి సూక్ష్మ ప్రణాళిక నివేదికను సమర్పిచాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ...

వివిధ క్లినికల్ విభాగాల కేటాయింపునకు కావలసిన  అంశాలను తెలియజేస్తూ  సూక్ష్మ ప్రణాళికను సిద్ధం చేసి ఉంచాలని ఆయా శాఖాధిపతులకు సూచించారు.   త్వరగా సూక్ష్మ ప్రణాళికను సిద్ధం చేసినట్లయితే ఆయా శాఖలకు కేటాయించాల్సిన వనరులు, వసతులు కల్పించేందుకు వీలవుతుందన్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న వివిధ పరికరాలను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించాలన్నారు. దీనికితోడుగా అవసరమగు  కొత్త పరికరాలు సంబంధిత శాఖ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.  సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏ అంతస్తులో ఏయే విభాగాల్లో  వసతులు ఉండాలో ఆ సూక్ష్మ ప్రణాళికలో ఉండాలన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నివేదించే సూక్ష్మ ప్రణాళిక గురించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంజిఎం సుపరింటెండెంట్ కిశోర్,  ఎల్ అండ్ టి  అధికారి శరవరన్, జిల్లా ఆర్ అండ్ బి. అధికారి రాజేందర్, టీఎస్ ఎంఐడిసి డీఈ, ఆర్ఎంవోలు, వివిధ విభాగాల వైద్య శాఖాధిపతులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >