Posted on 2025-07-09 18:05:36
మీకు హెలికాప్టర్ లో తిరగడానికి ఉన్న ధ్యాస ప్రజా సంక్షేమం మీద పెట్టి ఉంటే బాగుండేది
బారస జిల్లా అధ్యక్షురాలు
మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత
డైలీ భారత్, మహబూబాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పైన నిప్పులు చెరిగిన మాజీ ఎంపీ జిల్లా పార్టీ అధ్యక్షులు మాలోత్ కవిత . మంత్రులను తీసుకొని వచ్చి పెద్ద సభలు పెట్టి దండలు వేసి సన్మానాలు చేయడం ఫోటోలు దిగి మీడియా కవరెజి చేయడం కాదు , సోషల్ మీడియా పెట్టి హంగామా చేయడం కాదు అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే బి ఆర్ ఎస్ పదేళ్ల కాలంలో మీ ముందు కనిపిస్తున్న జిల్లా కలెక్టర్ భవనాలు పరిపాలన సౌలభ్యం. మెడికల్ కాలేజ్ లు పేద వారి వైద్యానికి పెద్ద పీట వేయడం. ప్రభుత్వ పాఠశాలలు , కళాశాలలు పేద విద్యార్థులకు విద్య అందించడం. పెరిగిన ధాన్యం ఉత్పత్తులు రైతులకు రైతు బంధు ,రైతు భీమా , ఎరువులు విత్తనాల కొరత లేకుండా చూడడం. వారికి గిట్టుబాటు ధర కల్పించడం. ప్రభుత్వ మరియు ప్రయివేటు రంగాల్లో ఉద్యోగ కల్పన తండాల్లో గ్రామాల్లో మెరుగైన జీవన విధానం వీటిని అభివృద్ధి అని అంటారు. గడిచిన కాలంలో ఎన్ని అభివృద్ధి పనులు చేపట్టారు ఎన్ని పనులను పూర్తి చేశారు ఒకసారి గుర్తు చేసుకోవాలి. చిత్తశుద్ధి ఉంటే మాకు ఓట్లు వేసిన ప్రజలకు ఏమి న్యాయం చేస్తున్నామని ఆలోచన చేయాలి. గ్రామ పంచాయతీ లో నిధులు లేక పరిపాలన అటకెక్కింది వర్ష కాలం గ్రామాల్లో గిరిజన ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు పైన ఇంతవరకు ఎటు వంటి రివ్యూలు లేవు.సాధారణంగా బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వర్షాకాలం ముందస్తుగా జిల్లా అధికారులు ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ,వర్ష కాలంలో అంటూ వ్యాధులు , సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకునే వారు..అసలు ఈరోజు వరకు ఒక రివ్యూ చేసిన పాపాన పోలేదు. పెద్ద పెద్ద సభలు పెట్టి అంకెల గారాడితో ప్రజలను బురిడీ కొట్టించి మళ్ళీ స్థానిక సంస్థకు ఎన్నికల కొరకు మంత్రుల బృంద కొత్త నాటకాలకు తెరలేపారు. ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజులలోనే అన్ని పథకాలు అమలు చేస్తానని చెప్పి 420 హామీలు ఇచ్చి గద్దె ఎక్కిన కేవలం ఢిల్లీకి మూటలు మోసే పనిలో బిజీగా వుండి ప్రజా సంక్షేమాన్ని ప్రజా పాలనను గాలికి వదిలేసి ప్రశ్నిస్తే కేసులు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, కొన్ని ప్రత్రికలు మీడియా ఛానల్ ల ముసుగులో అబ్బాద్దలను ప్రచారం చేస్తూ పాలన సాగిస్తున్నారు. ఇది ప్రజా పాలన కాదు ప్రజా వ్యతిరేక పాలన ఇందిరమ్మ రాజ్యం తెస్తాను అని నిజంగానే ఇందిరమ్మ ఎమర్జెన్సీ ని తలపించేలా పాలన సాగిస్తున్నారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రాహుల్ గాంధీ దేశం మొత్తం తిరుగుతుంటే ఇక్కడేమో రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఏనుమల రాజ్యాంగం అమలు పరుస్తున్నారు. అంత మంది మంత్రులు అంత ప్రజా దానం వృధా చేసి పెద్ద పెద్ద భారీ బహిరంగ సభలు పెట్టి కాలయాపన చేస్తున్నారు.
ప్రభుత్వం ఏర్పడి ఈనాటికి మహబూబాబాద్ జిల్లాలో ఎన్నో శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి కానీ ఒక్కటి కూడా పుర్తి అయిన దాఖలాలు లేవు కొన్ని అయితే కనీసం మొదలు సారి కదా వాటి ఊసే లేదు కేవలం శిలా పలకల మీద పేర్లు తప్ప జరిగిన అభివృద్ధి శూన్యం. గిరిజనులు అత్యధికంగా ఉండే మహబూబాబాద్ జిల్లాలో వారిని అబద్ధపు హామీలతో మోసం చేసి అధికారంలో వచ్చి ఇన్ని రోజులు గడిచిన సంపూర్ణ రుమమాఫీ చేయలేదు. రైతు బంధు మూడు దఫలు ఎగ్గొట్టారు.రైతు బందుకు అనేక కొర్రీలు పెట్టారు. రైతు బంధు కేవలం ఎన్నికల సమయంలో వేస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఈరోజు మన జిల్లాలో దాదాపుగా 250 మంది రైతులు చనిపోతే రైతు బీమా ప్రీమియం ప్రభుత్వం చెల్లింపు చేయక వారికి కుటుంబాలకు రైతు భీమా అందకుండా పోయింది. బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో ఎరువుల కొరత ఎక్కుడ కనిపించకుండా ఎక్కడికక్కడ అధికారులతో సమీక్షాలు నిర్వహించి ఏర్పాటు చేసేవారు. మరి ఇప్పుడు పాత రోజులు గుర్తు వచ్చేలా క్యూ లో చెప్పులు పెట్టి గంటల తరబడి వేచి చూసే దౌర్భాగ్యం తీసుకొని వచ్చారు. మీరు ప్రజా పాలన పేరుతో ప్రజలను మోసం చేస్తూ కాలం గడుపుతున్నారు. మహబూబాబాద్ గిరిజన సంక్షేమ పాఠశాలల్లో విద్యార్థులు సరైన ఆహారంలేక ,నాసిరకం ఆహారం మరియు అపరిశుభ్రత వల్ల అనేక విద్యార్థులు చిన్న చిన్న పిల్లలు ఫుడ్ పోయిజాన్ వల్ల ఆసుపత్రిల పాలైన దాఖలాలు మహబూబాబాద్ జిల్లాలో ఎనేకం వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో పేద గురిజన మరియు వెనుక బడిన విద్యార్థుల విద్య సంక్షేమం కొరకు నిరంతరం కృషి చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి ఈరోజు వరకు గురుకులల్లో అనేక సమస్యలు బోధన సిబ్బంది కొరత ,సరైన ఆహారం అందించక సరైన వసతులు లేక పేద గిరిజన విద్యార్థులు చదువుకోవడం కొరకు వచ్చి ప్రాణాలతో ఉంటే చాలు అనే పరిస్థితి ఏర్పడింది. మీ 420 హామీలు నెరేవేర్చే వరకు ప్రజల తరుపున పోరాడుతూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు చేసిన అన్యాయాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పడానికి సిద్దంగా ఉన్నారు.
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >