Posted on 2025-07-10 19:56:29
బాలుర ఐటిఐ కళాశాలను సందర్శించిన మాజీమంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఐ టి ఐ లో ఉండే వివిధ కోర్సులలో చేరి విద్యార్థులు తమ భవిష్యత్తు బంగారుమయంగా మార్చుకోవాలని మాజీమంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే పారిశ్రామిక శిక్షణ సంస్థలను నిరుద్యోగ, యువతీ యువకులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన హితవు పలికారు. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఆయన గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ లో గల ప్రభుత్వ బాలుర ఐ.టి.ఐను సందర్శించారు. టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, స్టెనో తదితర ట్రేడ్ లకు సంబంధించిన వర్క్ షాప్ లు, తరగతులకు వెళ్లి నిశిత పరిశీలన జరిపారు. వివిధ ట్రేడ్ లలో అందిస్తున్న శిక్షణ తీరు గురించి, అందుబాటులో ఉన్న యంత్ర పరికరాల గురించి ప్రిన్సిపాల్ యాదగిరిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఐ.టి.ఐ లలో చేరిన వారికి మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా నాణ్యతతో కూడిన శిక్షణ అందించాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యార్థులతో మమేకమై, వారికి అందిస్తున్న శిక్షణ తీరుతెన్నుల గురించి వాకబు చేశారు. స్కిల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఐ.టి.ఐ శిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వీటికి అనుసంధానంగా నేటి పారిశ్రామిక ఆవసరాలకు అనుగుణంగా అధునాతన కోర్సులలో శిక్షణ ఇప్పించేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ లను కూడా ప్రభుత్వం నెలకొల్పిందని గుర్తు చేశారు. ఐటిఐ లలో శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి రైల్వే, బీడీఎల్, మిధాని వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా, సొంతగా పరిశ్రమలు స్థాపించుకునేందుకు, ప్రైవేట్ రంగంలో ఆకర్షణీయ వేతనాలతో బహుళ జాతి పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన సాంకేతిక విద్యను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, యువతలో సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరచాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని అన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణులు అయిన వారు నేరుగా ఐ.టి.ఐ లలో ప్రవేశాలు పొంది, తాము ఎంచుకున్న కోర్సులలో శిక్షణ పొంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కించుకోవచ్చని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్లేస్ మెంట్ ల కోసం టాటా వంటి ప్రముఖ కంపెనీలతో కూడా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ప్రభుత్వ తోడ్పాటును విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఐ.టి.ఐలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ఐ.టి.ఐ ఇన్స్ట్రక్టర్ లు ఉన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >