| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన గచ్చిబౌలి మహిళ పోలీసు స్టేషన్ ఎస్సై

News

Posted on 2025-07-10 21:10:13

Share: Share


ఏసీబీకి చిక్కిన గచ్చిబౌలి మహిళ పోలీసు స్టేషన్ ఎస్సై

డైలీ భారత్, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా రోజుకో చోట అవినీతి అధికారులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడుతూనే ఉన్నారు. అయినా అధికారుల తీరులో మార్పు రావడం లేదు. మంగళవారం మాదాపూర్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ రూ.8 వేలు లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కగా.. గురువారం పోలీస్ శాఖకు చెందిన ఓ సబ్ ఇన్స్పెక్టర్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. కుటుంబ కలహాలతో అత్తింటి వారు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఓ వ్యక్తి గచ్చిబౌలి మహిళా పోలీసు స్టేషన్ కు వచ్చాడు. అక్కడ వారి కేసును విచారణ చేస్తున్న ఎస్సై వేణుగోపాల్ బాధితుడి మీద అత్తింటి వారు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా చేస్తానని, ఎలాంటి కేసు లేకుండా చూసుకుంటానని అందుకు తాను అడిగింది ఇవ్వాలంటూ బేరం కుదుర్చుకున్నాడు.

అందుకు అంగీకరించిన బాధితుడు లంచం ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇదే విషయమై ఏసీబీ అధికారుల ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నాడు. గురువారం గచ్చిబౌలి మహిళా పోలీస్టేషన్ కు చెందిన ఎస్సై వేణుగోపాల్ బాధితుడి వద్ద నుండి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వేణుగోపాల్ ఈ మధ్యనే ప్రమోషన్ లో భాగంగా ఎస్సైగా ప్రమోషన్ పొందినట్లు సమాచారం

Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >