Posted on 2025-07-14 12:28:28
డైలీ భారత్, బీహార్: కొడుకు కళ్ల ముందే భర్తను దారుణంగా నరికి చంపిందో ఇల్లాలు. నోరు తెరిస్తే నీక్కూడా ఇదే గతి పడుతుందని బెదిరించడంతో పన్నెండేళ్ల కుమారుడు భయంతో వణికిపోయాడు. ఈ ఘోరం బిహార్ లోని పూర్ణియా జిల్లాలో చోటుచేసుకుంది. ప్రియుడి కోసమే తాను ఈ పనిచేసినట్లు నిందితురాలు పోలీసులకు వెల్లడించడం అందరినీ విస్తుపోయేలా చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్ణియా జిల్లాకు చెందిన బాలో దాస్ (45), ఉషాదేవి దంపతులు తమ ముగ్గురు పిల్లలతో నివాసం ఉంటున్నారు. బాలో దాస్ పంజాబ్ లో కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సొంతూరిలోనే ఉన్న ఉషాదేవికి గ్రామంలో మరో యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అతడిని విడిచి ఉండలేనని భావించిన ఉషాదేవి.. లేచిపోయేందుకు భర్తకు తెలియకుండా ఇంటి స్థలాన్ని అమ్మేసింది.
ఆ డబ్బుతో ప్రియుడితో పరారయ్యేందుకు ప్లాన్ చేసింది. ఇంతలో స్థలం అమ్మిన విషయం తెలుసుకున్న భర్త హుటాహుటిన ఊరికి చేరుకుని భార్యను నిలదీశాడు. కొద్దిరోజులుగా ఇంట్లోనే ఉంటుండటంతో ప్రియుడిని కలిసే వీలు కూడా లేకపోయింది. దాంతో భర్తను అడ్డుతొలగించాలని నిర్ణయించుకుని ఆదివారం రాత్రి గడ్డికోసే కత్తితో భర్త గొంతు కోసింది. పక్కనే పడుకున్న కొడుకు ముఖంపై రక్తం చిందడంతో.. కళ్లు తెరిచి చూసి షాకయ్యాడు. భయంతో కేకలు పెట్టగా.. నోరు మూయకపోతే నిన్ను కూడా నరికేస్తా అని తల్లి బెదిరించడంతో తెల్లవారేంతవరకూ అలాగే ఉన్నాడు. ఉదయాన్నే బంధువులకు విషయం చెప్పగా.. గ్రామస్తులు, బంధువులంతా బాలోదాస్ ఇంటికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలోదాస్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి.. ఉషాదేవిని అరెస్ట్ చేశారు. ప్రియుడితో పారిపోయేందుకే భర్తను చంపినట్లుగా ఉషాదేవి అంగీకరించిందని పోలీసులు తెలిపారు
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >