| Daily భారత్
Logo




భార్యను చంపి సమాధిపై కూరగాయలు నాటిన భర్త.. 9 నెలల తర్వాత అరెస్టు

News

Posted on 2025-07-14 12:59:51

Share: Share


భార్యను చంపి సమాధిపై కూరగాయలు నాటిన భర్త.. 9 నెలల తర్వాత అరెస్టు

డైలీ భారత్, రేవా జిల్లా: నేరస్తులు తెలివి మీరి పోతున్నారు. నేరాలు చేసి, తప్పించుకోగలం అన్న ధీమాతో అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా, ఓ భర్త తన భార్యను హత్య చేశాడు. హత్య నుంచి తప్పించుకోవడానికి ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. భార్య శవాన్ని పొలంలో పూడ్చి పెట్టి.. వాటిపై కూరగాయలు నాటాడు. తర్వాత ఊరు విడిచిపారిపోయాడు. 9 నెలల పాటు ఎవ్వరికీ దొరకకుండా తప్పించుకుని తిరిగాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లోని రేవాలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

రేవా జిల్లాలోని సోహగి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న దేవ్‌ముని మజి, రామ్‌వతి భార్యాభర్తలు. వీరికి ఓ కూతురు, కొడుకు ఉన్నారు. జైల్ రోడ్డులోని పొలంలో దేవ్‌ముని కూరగాయలు పండించేవాడు. ఇందుకు భార్య, కూతురు సాయం చేసేవారు. 2024, అక్టోబర్ 11వ తేదీన దేవ్‌ముని తన భార్యను చంపేశాడు. ఆమె నోట్లో పురుగుల మందు పోసి హత్య చేశాడు. అనంతరం భార్య శవాన్ని పొలంలో పూడ్చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు దానిపై కూరగాయల మొక్కలు నాటాడు.

మధ్యాహ్నం రామ్‌వతి కొడుకు అభిలాష్ మజి పొలం దగ్గరకు వచ్చాడు. అక్కడ తల్లి కనిపించలేదు. తల్లి గురించి తన సోదరిని అడిగాడు. తల్లి ప్రయాగ్‌రాజ్ వెళ్లిందని ఆమె చెప్పింది. సాయంత్రం అయినా తల్లి ఇంటికి రాకపోవటంతో అభిలాష్ మజి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసు కేసు నేపథ్యంలో దేవ్‌ముని కూతుర్ని తీసుకుని ఊరు విడిచిపారిపోయాడు. దేవ్‌ముని తన భార్యను పొలంలో పూడ్చాడని పోలీసులు కనుగొన్నారు. పొలంలోని రామ్‌వతి మృతదేహాన్ని వెలికితీశారు. పరారీలో ఉన్న దేవ్‌ముని కోసం గాలింపు చేపట్టారు. తాజాగా, అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచారు.

Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >