| Daily భారత్
Logo




"మద్యపాన వ్యసనాన్ని విడనాడాలి" : డాక్టర్ బి. ప్రవీణ్ కుమార్

News

Posted on 2025-07-14 13:04:48

Share: Share


"మద్యపాన వ్యసనాన్ని విడనాడాలి" : డాక్టర్ బి. ప్రవీణ్ కుమార్

కార్మిక మనో వికాస సదస్సులో డాక్టర్ బి. ప్రవీణ్ కుమార్ పిలుపు.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్, ప్రభుత్వ ప్రధాన వైద్యశాల, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పవర్ లూమ్ కార్మికులకు మద్యపాన వ్యసన విముక్తికై ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని  గణేష్ నగర్ లో ఏర్పాటు చేసినారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ బి. ప్రవీణ్ కుమార్ హాజరై కార్మికులతో మాట్లాడినారు.

ఈ సందర్భంగా మద్యపాన వ్యసనాన్ని విడనాడాలనీ అన్నారు.

మద్యపాన వ్యసనం మూలంగా శారీరక, మానసిక, కుటుంబ పరమైన అనర్థాలను గురించి కార్మికులకు వివరించారు.

లివర్ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, మెదడుపై  ప్రభావం వల్ల మెమరీ లాస్, డిప్రెషన్, ఆందోళన, నిద్ర లేమి సమస్యలు ఏర్పడుతాయని అన్నారు.

జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడి ఎసోఫాగస్, లివర్, ఫాంక్రియాస్ సమస్యలు ఏర్పడి క్యాన్సర్లకు దారి తీస్తాయని తెలిపారు.

మానసిక మరియు భావజాల సమస్యలలో భాగంగా

నిరాశ, డిప్రెషన్,ఆత్మహత్యకు ప్రయత్నాలు,ఆందోళన, కోపం పెరగడం, నిర్ణయ సామర్థ్యం తగ్గిపోవడం జరుగుతుందని అన్నారు.

సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ 

కుటుంబ మరియు సామాజిక అనర్థాల గురించి మాట్లాడుతూ కుటుంబ కలహాలు, విడాకులు, పిల్లలపై ప్రతికూల ప్రభావం, పనితీరు తగ్గిపోవడం జరుగుతుందని తెలిపారు.

ఆర్ధికంగా దెబ్బతినడం, అసామాన్య ప్రవర్తన ఏర్పడుతాయని అన్నారు.

మద్యపానం మానేయడం వల్ల కలిగే మంచి గురించి కార్మికులకు వివరిస్తూ లివర్,  గుండె ఆరోగ్యం మెరుగుపడి రక్తపోటు నియంత్రణలో ఉంటుందని తెలిపారు.

అదేవిధంగా నిద్ర గుణం మెరుగై, రోగనిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు.

ప్రతికూల ఆలోచనలు, కోపం తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు.

మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్, ప్రభుత్వ సాధారణ వైద్యశాల యందు మద్యపాన వ్యసనం నుండి విముక్తి కోసం అధునాతన వైద్య చికిత్సలు, కౌన్సిలింగ్ లు ఇస్తున్నట్లు తెలుపుతూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ కె.పున్నంచందర్, మరమగ్గాల పారిశ్రామికుడు మంచే మల్లయ్య, మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ సిబ్బంది రాపెల్లి లత, బూర శ్రీమతి, కొండ ఉమ  కార్మికులు పాల్గొన్నారు.


Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >