Posted on 2025-07-14 18:54:57
డైలీ భారత్, దమ్మన్నపేట:భారతదేశం నుంచి అంతరిక్షానికి వెళ్లిన రెండవ ఖగోళయాత్రికుడు శుభాంశు శుక్లా భూమికి తిరిగివచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని, ZPHS దమ్మన్నపేట పాఠశాల విద్యార్థులు వినూత్నంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా విద్యార్థులు అంతరిక్ష రంగవల్లిలతో పాఠశాల మైదాన్నాన్ని అలంకరించడంతో పాటు , కాగితంతో తయారు చేసిన గ్లోబ్‌లు రూపొందించి ప్రదర్శిస్తూ, దేశభక్తి గీతం "సారే జహాఁ సె అచ్చా" ను ఆలపించారు. అంతేకాకుండా, శుభాంశు శుక్లా ప్రయాణ విశేషాలను చూపించే విపులమైన పోస్టర్ రూపొందించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు బోయన్నగారి నారాయణ మాట్లాడుతూ,
"శుభాంశు శుక్లా సుమారు 18 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఈ సమయంలో ఆయన భూమి చుట్టూ సుమారు 96 లక్షల కిలోమీటర్లు ప్రయాణించారు. అంతరిక్ష నావ "ఇన్‌ఎస్‌ఎస్" (INS)లో ఉన్నప్పుడే అనేక శోధనలు చేపట్టారు. యూరీ గగారిన్, రాకేష్ శర్మ తరువాత అంతరిక్షానికి వెళ్లిన రెండవ భారతీయుడు శుక్లా" అని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞానం, దేశభక్తి, మరియు శాస్త్రీయ ఆవిష్కరణల పట్ల ఆసక్తి పెరిగినట్టు ఉపాధ్యాయులు తెలియజేశారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >