| Daily భారత్
Logo




మహిళా సాధికారతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం : రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి

News

Posted on 2025-07-14 19:38:45

Share: Share


మహిళా సాధికారతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం : రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మహిళల సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. బోర్గం(పి)లోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తో కలిసి వడ్డీ లేని రుణాలు, బీమా చెక్కులను మహిళా సంఘాలకు పంపిణీ చేశారు. మహిళల అభివృద్ధికి సోలార్ ప్లాంట్లు,ఉచిత బస్సులు ప్రయాణం, పెట్రోల్ బంకులు, శక్తి క్యాంటీన్లు, బజార్లు, స్కూల్ యూనిఫాం స్టిచింగ్, ధాన్యం కొనుగోలు కేంద్రాల వంటి అంశాల్లో అవకాశాలు కల్పిస్తున్నామని రూరల్  ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. వెనుకబడిన మహిళలకు చేయూతగా ఉచిత ఆర్టీసీ ప్రయాణంతో పాటు ఇందిరమ్మ ఇళ్ళను మహిళల పేరిట మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. నాలుగేళ్లలో మహిళల సంక్షేమానికి రూ. లక్ష కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో చట్టసభలలో 33% రిజర్వేషన్ల తీర్మానాన్ని కేంద్రానికి పంపినట్టు వెల్లడించారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో 20,547 మహిళా సంఘాలకు రూ. 21.69 కోట్లు రుణాలు మంజూరు చేశామని, రూరల్ నియోజకవర్గంలో 5,781 సంఘాలకు రూ. 5.91 కోట్లు ఇచ్చినట్టు వివరించారు.


ఈ వేడుకలలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, డీఆర్డీఓ సాయాగౌడ్,పీసీసీ డెలికెట్ శేఖర్ గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోలసాని శ్రీనివాస్,డీసీసీ డెలికెట్ ధర్మగౌడ్, యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్, మాజీ ఐ సి డి ఎం ఎస్ చైర్మన్ మునిపల్లి సాయరెడ్డి, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, వివిధ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృత పూర్ గంగాధర్, నవీన్ గౌడ్, ఎల్లయ్య, సాయరెడ్డి,  సొసైటీల చైర్మన్లు రామచంద్ర గౌడ్ నల్ల చంద్రశేఖర్ రెడ్డి  , కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేందర్, శ్రీనివాస్,  జిల్లా, మండల మహిళా సమాఖ్యల ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >