Posted on 2025-07-18 16:27:43
స్నేహ సొసైటీ సిద్దయ్య, స్నేహ సొసైటీ అందుల పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి లు వెల్లడి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేది బోనాలు అని స్నేహ సొసైటీ సిద్దయ్య, స్నేహ సొసైటీ అందుల పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి అన్నారు. శుక్రవారం నగరంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఆవరణంలో సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మొదట స్నేహ సొసైటీ ఆవరణలో డప్పులతో బోనాలు ఎత్తుకొని నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మ వారికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆడపడుచులకు తాంబూళం అందజేసి ఒకరికి ఒకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ మహిళలు తలపై బోనాలు మోసుకుంటూ స్నేహ సొసైటీ నుండి హౌసింగ్ బోర్డు కాలోనీ పోచమ్మ మందిరానికి ఊరేగింపుగా తరలివెళ్లారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఒడిబియ్యం, వస్తాలు, నైవేద్యాలు సమర్పించారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, మొక్కులు తీర్చుకున్నారు. జిల్లా ప్రజలు సుభిక్షంగా ఆనందోత్సహాల మధ్య ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని అన్నారు. స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బోనాల పండగ నిర్వహించడం ఎంతో శుభ సూచకమని అమ్మవారి దయ వివిధ విభాగాలలో పనిచేస్తున్న సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, అవరోధాలు లేకుండా ఎలాంటి మహమ్మారిలు రాకుండా చూడాలని కోరారు. సమృద్ధిగా వర్షాలు కురిసి సిరిసంపదలతో విరజిల్లాలని కోరుతూ అమ్మవారికి బోనాలను సమర్పించుకోవడం జరిగిందని అన్నారు. రైతులు, సైనికుల తో పాటు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అందులో మనం ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు. బోనాలు కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్లు, వంశీ ప్రియ, సుచి ప్రశాంతిలు బోనాలు ఎత్తుకున్నారు.
ఈ కార్యక్రమంలో మానసిక దివ్యంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి కోఆర్డినేటర్ కిరణ్మయి స్నేహ టీవీ ప్రోగ్రాం మేనేజర్ బాలరాజు ట్రాంజెండర్ల నాయకులు జరీనా, గంగా, శ్యామల, ఆరతి, పాల్గొన్నారు. వీరితోపాటు స్నేహ టి ఐ జిఎన్ఎమ్ కౌన్సిలర్ అవుట్ రీచ్ వర్కర్లు, ఫీల్ ఎడ్యుకేటర్లు, మహిళ సెక్స్ వర్కర్లు పాల్గొన్నారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >