| Daily భారత్
Logo




ప్రెస్టేజ్ ఆసుపత్రి లోబోనాల ఘనంగా బోనాల సంబరాలు

News

Posted on 2025-07-21 18:23:19

Share: Share


ప్రెస్టేజ్ ఆసుపత్రి లోబోనాల ఘనంగా బోనాల సంబరాలు

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాలు

ప్రముఖ వైద్యురాలు ప్రతిమ రాజ్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేది బోనాలు అని ప్రెస్టేజ్ ఆసుపత్రి ప్రముఖ క్రిటికల్ కేర్ వైద్యులు, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరిండెంట్ డాక్టర్ ప్రతిమా రాజ్  అన్నారు.  సోమవారం నగరంలోని ప్రెస్టేజ్ హాస్పిటల్ ఆవరణంలో సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.డప్పులతో బోనాలు ఎత్తుకొని నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మ వారికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆడపడుచులకు తాంబూళం అందజేసి ఒకరికి ఒకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతిమరాజ్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ప్రజల సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, మొక్కులు తీర్చుకున్నారు. జిల్లా ప్రజలు సుభిక్షంగా ఆనందోత్సహాల మధ్య ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని అన్నారు.జిల్లా ప్రజలు సుభిక్షంగా ఆనందోత్సహాల మధ్య ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని అన్నారు. ప్రతి సంవత్సరం బోనాల పండగ నిర్వహించడం ఎంతో శుభ సూచకమని అమ్మవారి దయ వివిధ విభాగాలలో పనిచేస్తున్న సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, అవరోధాలు లేకుండా ఎలాంటి మహమ్మారిలు రాకుండా చూడాలని కోరారు. సమృద్ధిగా వర్షాలు కురిసి సిరిసంపదలతో విరజిల్లాలని కోరుతూ అమ్మవారికి బోనాలను సమర్పించుకోవడం జరిగిందని అన్నారు. దేశ రైతులు, సైనికుల తో పాటు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అందులో మనం ఉండాలని కోరుకున్నారు.


ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ మహమ్మద్ కైఫ్, మహిమూద్, ఇన్చార్జిలు షేక్ మోయిన్, కాశిఫ్, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >