Posted on 2025-07-25 08:05:47
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు జిల్లా న్యాయ సేవాధికర సంస్థ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని సహస్ర జూనియర్ కళాశాలలో "ర్యాగింగ్ నిషేధంపై అవగాహన సదస్సు" నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి - కం - జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ మాట్లాడుతూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు P.నీరజ ఆదేశాలతో ర్యాగింగ్ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని, విద్యా సంస్థలలో ర్యాగింగ్ చేయడం నేరమని, ర్యాగింగ్ కారణంగా బాధిత విద్యార్థులు అనేక మనోవేదనలు అనుభవించి, కొంతమంది తాము చదువు కొనసాగించలేని పరిస్థితిలోకి వస్తున్నారని అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు మరియు ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఎక్కడైనా ర్యాగింగ్ జరిగితే వెంటనే సంబంధిత అధికారులు, పోలీసులకు తెలియజేయాల్సిందిగా కోరారు.
ఈ అవగాహన సదస్సులో లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, న్యాయవాదులు ఆడెపు వేణు, గెంట్యాల భూమేష్ వివిధ అంశాలపై అవగాహన కల్పించారు . కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >