| Daily భారత్
Logo




జూలూరుపాడు మండలం కరివారిగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

News

Posted on 2025-07-25 09:21:13

Share: Share


జూలూరుపాడు మండలం కరివారిగూడెం  గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

యువతకు మార్గనిర్దేశకులు మాజీ మంత్రి కేటీఆర్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ  ఐటి కి బ్రాండ్ అంబాసిడర్గాకేటీఆర్అభివృద్ధిలో రాష్ట్రానికి వన్నె తెస్తు దేశంలో అగ్రస్థానంలో రాష్ట్రం రాజకీయ దురంధరుడు కేటిఆర్ వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ఆధ్వర్యంలో తెలంగాణ ఐటీ కియువతకుమార్గదర్శకంగా నిలుస్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  చిరకాలం ప్రజాసేవలో సేవ కొనసాగాలని వైరా నియోజకవర్గ   జూలూరుపాడు మండల కరివారిగూడెం గ్రామంలో గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు  కార్యకర్తలు  ప్రధాన సెంటర్లో వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ... ప్రజలందరి ఆశీర్వాదంతో కేటీఆర్  నిండ నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. మరియు ఏన్కూరు మండలం ప్రధాన రహదారి సెంటర్లో కేక్ కటింగ్ చేయడంజరిగింది  ఆకాంక్షల మేరకు ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని వదిలి,రాష్ట్ర రాజకీయాల్లో అడుగు వేసి  ప్రజల సంక్షేమం కోసం జీవితాన్ని త్యాగం చేస్తున్నా గొప్ప నాయకుడు కేటీఆర్ అని ఆయన అన్నారు. ఆ రోజు రామాయణంలో రాముడు ఏ విధంగా లోకకళ్యాణం కోసం పరిపాలన చేశారో కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ రాష్ట్రంలో రామ రాజ్యం స్థాపన కోసం అహర్నిశలు కృషి చేయడం జరిగిందని తెలిపారు. ఏ ఆశయంతో నైతే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందో ఆ ఆశయ సాధన కోసం తండ్రి  తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాల్లో అపర చాణక్యుడు అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఐటి హబ్ గా మార్చి వేలాది మంది యువతకు ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నింపిన యువ నాయకుడు కేటీఆర్ అన్నారు. నడక నడవడికలో మాటలో మంచితనం మచ్చలేని నాయకుడు కేటీఆర్ అని కితాబు ఇచ్చారు. ఉన్నత విద్యలు అభ్యసించి లక్షల్లో వేతనం ఉన్నా ఉద్యోగం వదిలి ప్రజాసేవ కోసం  రాజకీయాల్లోకి అడుగు పెట్టారు అని అన్నారు. భవిష్యత్తులో కేటీఆర్  మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా నేడు రాష్ట్రంలో ఎదిగిందన్నారు. నేడు యువత అంతా కేటీఆర్ బాటలో పరిగెడుతున్నారు అని అన్నారు. నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Image 1

"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు

Posted On 2026-06-19 08:33:46

Readmore >
Image 1

అరవల్లి SI ఈట సైదులు సస్పెండ్

Posted On 2026-06-19 08:09:23

Readmore >
Image 1

శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-19 08:06:56

Readmore >
Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-18 20:47:25

Readmore >
Image 1

స్కూళ్ల మూసివేత నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి

Posted On 2026-06-18 20:45:05

Readmore >
Image 1

ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం

Posted On 2026-06-18 20:43:25

Readmore >
Image 1

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-18 18:24:01

Readmore >