| Daily భారత్
Logo




జర్నలిస్ట్‌లకు గుడ్ న్యూస్... వచ్చే వారం జర్నలిస్ట్‌లకు కొత్త అక్రిడిటేషన్లు

News

Posted on 2025-07-25 09:22:55

Share: Share


జర్నలిస్ట్‌లకు గుడ్ న్యూస్... వచ్చే వారం జర్నలిస్ట్‌లకు కొత్త అక్రిడిటేషన్లు

తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

డైలీ భారత్, ఖమ్మం జిల్లా: జర్నలిస్టులకు సంబంధించి కీలకమైన మూడు ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే జర్నలిస్ట్‌లకు కొత్త అక్రిడిటేషన్లు ఇస్తామని ప్రకటించారు. ఇవాళ(గురువారం, జులై 24) ఖమ్మం జిల్లాలోని వైరాలో టీయూడబ్ల్యూ జే (ఐజేయూ) నాల్గో జిల్లా మహాసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

వచ్చేవారంలో అక్రిడిటేషన్ కార్డులు: మంత్రి పొంగులేటి

వచ్చేవారంలో అక్రిడిటేషన్ కార్డుల మంజూరు విషయంలో యూనియన్ నాయకులతో చర్చించి ఫైనల్ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత వెంటనే హెల్త్ కార్డులు ఇస్తామని వెల్లడించారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉండటంతో న్యాయ నిపుణులతో చర్చించి ఎలాంటి ఆటంకం కలగకుండా ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని మాటిచ్చారు. జర్నలిస్టుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఉద్ఘాటించారు. జర్నలిస్టులకు అన్నివిధాలా అండగా ఉంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు..

Image 1

"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు

Posted On 2026-06-19 08:33:46

Readmore >
Image 1

అరవల్లి SI ఈట సైదులు సస్పెండ్

Posted On 2026-06-19 08:09:23

Readmore >
Image 1

శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-19 08:06:56

Readmore >
Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-18 20:47:25

Readmore >
Image 1

స్కూళ్ల మూసివేత నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి

Posted On 2026-06-18 20:45:05

Readmore >
Image 1

ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం

Posted On 2026-06-18 20:43:25

Readmore >
Image 1

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-18 18:24:01

Readmore >