| Daily భారత్
Logo




రైల్వే క్వార్టర్స్ మహాశక్తి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

News

Posted on 2025-08-09 13:58:23

Share: Share


రైల్వే క్వార్టర్స్ మహాశక్తి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

సంతోషిమాత జన్మదినం సందర్భంగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని రైల్వే క్వార్టర్స్ లోని అతి ప్రాచీనమైన మహాశక్తి హనుమాన్ ఆలయంలో శనివారం సంతోషిమాత అమ్మవారి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్ అగర్వాల్ ఆధ్వర్యంలో ఇతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిఅర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్త ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజ అభిషేక అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే అమ్మవారికి హారతి కార్యక్రమం నిర్వహించారు. ఇదిలా ఉండగా భజన మండలి వారు నిర్వహిస్తున్న భజన గీతాలను చూసి ఎమ్మెల్యే స్టేజిపై ఎక్కి హనుమాన్ మంత్రాన్ని ఆలపించారు. ఆలయం నుండి పురవీధుల గుండా పల్లకి సేవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధనపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రాచీనమైన పురాతనమైన ఈ ఆలయంలో భక్తులు కోరిన కోర్కెలు తీర్చే ఆలయంగా ప్రసిద్ధి చెందిందని అన్నారు. ఇక్కడ ఆలయంలో ఉన్న పలు దేవతల మూర్తులకు ఏ కష్టాలు ఉన్న భక్తితో నిష్టతో పూజిస్తే అన్ని బాధలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకమని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి సత్య గిరి, కోశాధికారి వినోద్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

కాంగ్రెస్ గూటికి బ్రహ్మణపల్లి గ్రామ సర్పంచ్

Posted On 2026-07-13 18:21:10

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణిలో 114 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-07-13 18:18:22

Readmore >
Image 1

కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్‌

Posted On 2026-07-13 18:16:26

Readmore >
Image 1

షాబాద్ ఆరు హత్యల కేసు...ఆ కారణంతోనే భార్య, పిల్లల హత్య

Posted On 2026-07-13 18:11:11

Readmore >
Image 1

షాబాద్‌ హంతకుడు రాజ్‌కుమార్‌ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు

Posted On 2026-07-13 18:10:28

Readmore >
Image 1

రీ-సర్వేను అడ్డుకుని, కులం పేరుతో దూషణలు... మరిపెడ బంగ్లాలో భూ యజమానుల బాగోతం!

Posted On 2026-07-13 15:55:48

Readmore >
Image 1

పెంజర్ల వెంచర్‌లో దొరికిన మృతదేహం.. షాబాద్ సీరియల్ కిల్లర్ కథ ముగిసిందా?

Posted On 2026-07-13 13:56:11

Readmore >
Image 1

హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు... రాజన్న సిరిసిల్లలో నిబంధన అమలు...

Posted On 2026-07-13 13:25:59

Readmore >
Image 1

జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు

Posted On 2026-07-13 05:57:44

Readmore >
Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >