Posted on 2025-08-09 14:31:23
మూడో డివిజన్లో రోడ్డు నిర్మాణం కోసం మున్సిపల్ అధికారుల దగ్గరికి వెళ్లి విన్నవించిన ఫలితం శూన్యం..
చేసేదేమీ లేక కాలనీ వాసులు చందాలు వేసి రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న కాలనీవాసులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా మహాలక్ష్మి కాలనీ సాయి టవర్స్ వాసులు.. చందాలు వేసి రోడ్డు నిర్మించుకున్నారు. కాలనీ లో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంత కాలంగా రోడ్డు గుంతల మయంగా మారింది. ఆ రోడ్డు వెంట వెళ్ళిన పలువురు గుంతల్లో పడి గాయపడ్డారు. ఇటీవల కురిసిన వర్షాల కు గుంతల్లో నీళ్లు చేరి.. పిల్ల కాలువలను తలపించింది రోడ్డు. ఈ క్రమంలో సాయి టవర్స్ వాసులు మున్సిపల్ అధికారులకు తమ సొసైటీ నుంచి వినతి పత్రం అందించారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడం తో.. సాయి టవర్స్ అపార్ట్ మెంట్ వాసులు చందాలు వేసుకుని రోడ్డు పై పడ్డ గుంతలను పూడ్చారు. గతుకుల రోడ్డు ను కాస్తా అందంగా ముస్తాబు చేశారు. కాలనీ లో డ్రైనేజీ సౌకర్యం, తాగునీటి సౌకర్యం లేదని అధికారులు స్పందించి డ్రైనేజీ, తాగునీటి వసతి కల్పించాలని లేని పక్షంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్క రించాలని నిర్ణయించారు. మున్సిపల్ అధికారులకు ఇంటి పన్నులు సైతం చెల్లించవద్దని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సాయి టవర్స్ వెల్ఫర్ సొసైటీ అధ్యక్షులు మహేష్, కార్యదర్శి బాల్ రావు, కోశాధికారి రాజు, సలహాదారులు సింహాచలం, సంజీవ రెడ్డి, వరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రీ-సర్వేను అడ్డుకుని, కులం పేరుతో దూషణలు... మరిపెడ బంగ్లాలో భూ యజమానుల బాగోతం!
Posted On 2026-07-13 15:55:48
Readmore >
పెంజర్ల వెంచర్‌లో దొరికిన మృతదేహం.. షాబాద్ సీరియల్ కిల్లర్ కథ ముగిసిందా?
Posted On 2026-07-13 13:56:11
Readmore >
హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు... రాజన్న సిరిసిల్లలో నిబంధన అమలు...
Posted On 2026-07-13 13:25:59
Readmore >
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >