| Daily భారత్
Logo




"తెలంగాణ రాష్ట్ర సైకాలజిస్టుల మండలి ఏర్పాటుకు కృషి"

News

Posted on 2025-08-10 13:11:23

Share: Share


"తెలంగాణ రాష్ట్ర సైకాలజిస్టుల మండలి ఏర్పాటుకు కృషి"

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హామీ

డైలీ భారత్, వేములవాడ: తెలంగాణ రాష్ట్ర సైకాలజిస్టుల మండలి ఏర్పాటు కోసం తెలంగాణ సైకాలజిస్టుల సంఘం (TPA) చేస్తున్న కృషికి ప్రభుత్వ విప్ మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పూర్తి మద్దతు తెలిపారు.

ఈ రోజు సిరిసిల్లలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను కల్సి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో సైకాలజిస్టు మండలి ఏర్పాటు కు తన వంతు కృషి చేస్తానని అన్నారు.

TPA ప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా 2,500కు పైగా సైకాలజిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను, మండలి ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, “మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న ఈ కాలంలో సైకాలజిస్టుల పాత్ర అత్యంత కీలకం అని అన్నారు.

 ఈ సందర్భంగా మండలి ఏర్పాటుకు నేను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని, అవసరమైన మద్దతు ఇస్తాను” అని హామీ ఇచ్చారు.

TPA ప్రధాన డిమాండ్లు ల ను గురించి  సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనుకుంట్ల పున్నంచందర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు వివరించారు.

సైకాలజిస్టులకు చట్టబద్ధ గుర్తింపు & లైసెన్సింగ్ వ్యవస్థ

మానసిక ఆరోగ్య కేంద్రాలకు ప్రమాణపూర్వక నియంత్రణ

వృత్తి అభివృద్ధి కోసం నిరంతర శిక్షణ, పరిశోధనకు ప్రోత్సాహం అవసరం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కనుకుంట్ల పున్నంచందర్, జిల్లా అధ్యక్షుడు వై. ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి సి హెచ్ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Image 1

రీ-సర్వేను అడ్డుకుని, కులం పేరుతో దూషణలు... మరిపెడ బంగ్లాలో భూ యజమానుల బాగోతం!

Posted On 2026-07-13 15:55:48

Readmore >
Image 1

పెంజర్ల వెంచర్‌లో దొరికిన మృతదేహం.. షాబాద్ సీరియల్ కిల్లర్ కథ ముగిసిందా?

Posted On 2026-07-13 13:56:11

Readmore >
Image 1

హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు... రాజన్న సిరిసిల్లలో నిబంధన అమలు...

Posted On 2026-07-13 13:25:59

Readmore >
Image 1

జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు

Posted On 2026-07-13 05:57:44

Readmore >
Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >