| Daily భారత్
Logo




ఎంపీ అరవింద్ సారూ.. పిఎఫ్ కార్యాలయంపై జర దృష్టి పెట్టండి సారూ...

News

Posted on 2025-08-10 18:01:07

Share: Share


ఎంపీ అరవింద్ సారూ.. పిఎఫ్ కార్యాలయంపై జర దృష్టి పెట్టండి సారూ...

కార్యాలయంలో ఉన్నత అధికారులు లేక లక్షల్లో ఉన్న పెన్షన్ పెండింగ్ ఫైళ్లు..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యాల్కల్ రోడ్డులో ఉన్న పి ఎఫ్ కార్యాలయంలో అసలైన ఉన్నతాధికారులు లేక ఏళ్ల తరబడిగా లక్షలాదిగా పెన్షన్ కు సంబంధించిన ఫైళ్లు పడి ఉన్నాయి. అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పిఎఫ్  ప్రాంతీయ కార్యాలయాన్ని అప్పటి ఎంపీ దివంగత నేత కేశ్ పల్లి  గంగారెడ్డి హయాంలో ఆయన ప్రత్యేక చోరవతో  జిల్లాలో ప్రారంభమైంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వాలు జిల్లాల్లో ఉన్న పిఎఫ్ ప్రాంతీయ కార్యాలయం లో ఉద్యోగుల భర్తీ విషయంలో విముఖత చూపుతున్నారని విషయం తేటతెల్లమవుతుంది. ఈ కార్యాలయంలో అసిస్టెంట్ పిఎఫ్ కమిషనర్ తో పాటు, సూపరిండెంట్లు, ఏవో, మిగతా అధికారుల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. దీనివల్ల ఆధార్ లింకు సమస్య ఏర్పడడంతో లక్షకు పైగా పింఛన్ ఫైళ్లు  పెండింగ్లో ఉన్నాయి. అయితే బీడీ కార్మికులు, ఇతర ఉద్యోగులు ఎక్కువగా ఉన్న మన జిల్లాలో ఏళ్ల తరబడిగా పెన్షన్ రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో జిల్లా ఎంపీ  ప్రాంతీయ కార్యాలయం పై ప్రత్యేక దృష్టి వహించి కార్యాలయంలో ఉన్నతాధికారులు ను నియమించే విషయంలో శ్రద్ధ వహించి కేంద్ర కార్మిక శాఖ మంత్రితో మాట్లాడి ఏళ్ల తరంగా పెన్షన్ కోసం వేచి చూస్తున్నా పెన్షన్ దారులు ఎంపీని విన్నవిస్తున్నారు. వృద్ధాప్య సమయంలో పెన్షన్ దారులకు పెన్షన్ రాకపోవడంతో తాము బతికేది ఎలా అంటూ ఆందోళన చెందుతున్నారు.

Image 1

రీ-సర్వేను అడ్డుకుని, కులం పేరుతో దూషణలు... మరిపెడ బంగ్లాలో భూ యజమానుల బాగోతం!

Posted On 2026-07-13 15:55:48

Readmore >
Image 1

పెంజర్ల వెంచర్‌లో దొరికిన మృతదేహం.. షాబాద్ సీరియల్ కిల్లర్ కథ ముగిసిందా?

Posted On 2026-07-13 13:56:11

Readmore >
Image 1

హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు... రాజన్న సిరిసిల్లలో నిబంధన అమలు...

Posted On 2026-07-13 13:25:59

Readmore >
Image 1

జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు

Posted On 2026-07-13 05:57:44

Readmore >
Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >