Posted on 2025-08-11 10:26:44
డైలీ భారత్, నాగ్‌పూర్: నాగ్‌పూర్ లో హృదయవిదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కన్నీళ్లు పెట్టించే ఓ ఘటన చోటు చేసుకుంది. ఎవరూ సహాయం చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని బైక్‌కు కట్టుకుని తీసుకెళ్లిన విషాద ఘటన నాగ్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది. నాగ్‌పూర్-జబల్‌పూర్ జాతీయ రహదారిపై ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది
నాగ్‌పూర్-జబల్‌పూర్ జాతీయ రహదారిపై అమిత్ తన భార్యతో కలిసి ప్రయాణిస్తున్నాడు. అమిత్ భార్య తన సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళ్తోంది. డియోలాపర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోర్ఫాటా సమీపంలో ఆదివారం మధ్యాహ్నం వారు ప్రయాణిస్తున్న బైక్‌ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొనడంతో అమిత్ భార్య అక్కడికక్కడే మరణించింది. ప్రమాదం తర్వాత అమిత్ ఆ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను సహాయం కోరాడు. కానీ ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. దీంతో చేసేదేం లేక భార్య మృతదేహాన్ని తన బైక్‌కు కట్టుకున్నాడు.
భార్య మృతదేహాన్ని బైక్‌కు కట్టుకుని హైవే మీద ప్రయాణించాడు. అతడిని చూసి కొందరు వాహనదారులు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే ఏ కారణం చేతనో అమిత్ మాత్రం బైక్ అపకుండా నేరుగా తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. ఆ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ హృదయవిదారక ఘటన చాలా మందికి కన్నీళ్లు తెప్పిస్తోంది.
పెంజర్ల వెంచర్‌లో దొరికిన మృతదేహం.. షాబాద్ సీరియల్ కిల్లర్ కథ ముగిసిందా?
Posted On 2026-07-13 13:56:11
Readmore >
హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు... రాజన్న సిరిసిల్లలో నిబంధన అమలు...
Posted On 2026-07-13 13:25:59
Readmore >
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >