Posted on 2025-08-11 15:14:03
డైలీ భారత్, చందుర్తి : యూరియా కొరతతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో అర్ధరాత్రి వరకు మహిళా రైతులు క్యూ లైన్‌లో నిలుచొని యూరియా కోసం అవస్థలు పడ్డ విషయం మరవకముందే.. చందుర్తిలో చెప్పులతో క్యూలైన్ పెట్టారు. చందుర్తి సహకార సంఘంలో సోమవారం యూరియా పంపిణీ విషయం తెలుసుకున్న రైతులు ఉదయమే చేరుకొని చెప్పులు క్యూ లైన్ పెట్టారు.
జిల్లాలో ఎరువుల కొరత లేదని ఒకవైపు అధికారులు ప్రకటనలు ఇస్తుండగానే యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. ఒక ఎకరానికి ఒకే బస్తా యూరియా మాత్రమే ఇస్తుండడంతో తీవ్ర ఇబ్బంది పడుతూ గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సొంత గ్రామం, మండలంలో ఎరువుల కోసం రైతుల అవస్థలు పడుతుండటం గమనార్హం.
పెంజర్ల వెంచర్‌లో దొరికిన మృతదేహం.. షాబాద్ సీరియల్ కిల్లర్ కథ ముగిసిందా?
Posted On 2026-07-13 13:56:11
Readmore >
హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు... రాజన్న సిరిసిల్లలో నిబంధన అమలు...
Posted On 2026-07-13 13:25:59
Readmore >
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >